TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కార్లు మార్చినట్టు పెళ్ళాల్ని మారుస్తాడు.!!

Published on: Wed Jul 25, 2018 11:37AM

అవిశ్వాసం పై చర్చ నేపథ్యం లో పవన్ కళ్యాణ్ వైసీపీ ఎంపీలు, పార్టీ అధినేత జగన్ పై విమర్శలు చేయటం మన అందరికి తెలిసిందే.దీంతో తూర్పు గోదావరి జిల్లాలో పాదయాత్రలో ఉన్న జగన్ పవన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.‘‘మన ఖర్మేమిటంటే. ఇవాళ పవన్‌ కల్యాణ్‌ అనే వ్యక్తి మాట్లాడుతున్నా మనం వినాల్సి వస్తోంది.పవన్‌ కల్యాణ్‌ ఆరు నెలలకోసారో ఏడాదికోసారో బయటకు వస్తాడు. ఎప్పుడో ఒకరోజు ఒక ట్వీట్ చేస్తాడు. లేకపోతే ఒక ఇంటర్వ్యూ ఇస్తాడు. నాలుగేళ్లూ కూడా ఎక్కడ కావాల్సి వస్తే అక్కడ చంద్రబాబును రక్షించడానికే బయటకు వచ్చాడు.

 

 

ఇలాంటి వ్యక్తి కూడా రాజకీయాల్లో మాట్లాడడం మొదలు పెడితే, దాని గురించి కూడా మనం సమాధానం చెప్పాలంటే, నిజంగా ఎక్కడివీ విలువలు? విలువల గురించి తాను మాట్లాడతాడు. నిజంగా ఎక్కడున్నాయండీ తనకు విలువలు? నలుగురు నలుగురు పెళ్లాలు. కొత్త కారును మార్చినట్టు పెళ్లాన్ని మారుస్తాడు.నాలుగేళ్లకోసారి ఐదేళ్లకోసారి పెళ్లాన్ని మారుస్తాడు. ఇలాంటి పనిని నేనో నువ్వో మరొకరో చేసి ఉంటే నిత్య పెళ్లికొడుకని చెప్పి జైల్లో వేసేవారా కాదా? ఇది బహు భార్యత్వం కాదా? అని ప్రశ్నించారు.నాలుగేళ్లు ఇదే పెద్దమనిషి చంద్రబాబునాయుడుతో, బీజేపీతో.. వాళ్లిద్దరితో కలిసి కాపురం చేశాడు. ఎన్నికలకు ఆరు నెలల ముందు టీడీపీ, బీజేపీల నుంచి పవన్ కళ్యాణ్ బయటకొచ్చి తాను పతివ్రతను అని గట్టిగా చెబుతున్నాడు. ఈ ముగ్గురూ కలిసి ఆంధ్ర రాష్ట్రాన్ని పొడిచేశారు. పొడిచిన తర్వాత నాలుగేళ్లు గమ్మున ఉన్నారు. కలిసికట్టుగా సంసారం చేశారు. ఎన్నికలకు ఆరు నెలల ముందు బయటకొచ్చి ఒక్కొక్కరు ఒక్కో మాట మాట్లాడుతున్నారు. తప్పు చేసింది తాను కాదంటే తాను కాదని చెబుతున్నారు ' అని జగన్ మండిపడ్డారు.