TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జగన్ ప్రెస్ మీట్లు.. మీమర్లకు పండుగ.. వైసీపీకి దండగ.!

Published on: Fri Aug 21, 2026 2:21PM

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైపీపీ అధినేత ప్రెస్ మీట్ అనగానే వైసీపీ నేతలు, శ్రేణుల గుండెల్లో గుబులు మొదలౌతుంది. అదే సమయంలో ఆయన ప్రత్యర్థులకు, నెటిజనులకు, మీమర్లకు పండుగ వస్తున్నదన్నంత ఆనందం మొదలౌతుంది. జగన్.. పర్యటనలు, ప్రకటనలు, మీడియా సమావేశాలు ఎప్పుడూ రాజకీయ సంచలనమే. ఆయన ఏం మాట్లాడినా నెటిజనులకు, విమర్శకులకు, ప్రత్యర్థులకు ఎప్పుడూ అడ్డంగా దొరికి పోతుంటారు. వాస్తవ దోషాలు, తప్పులు, తడబాటు ఇవే జగన్ రెడ్డి ప్రసంగాలనూ, ప్రెస్ మీట్లనూ ప్రత్యేకంగా నిలుపుతాయి.  

  తాజాగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఏపీపీఎస్సీ, డీఎస్సీ రెండూ ఒకటేనంటూ చేసిన వ్యాఖ్యలు వైసీపీ నేతలను తలలుపట్టుకునేలా చేస్తే.. ఆయన ప్రత్యర్థులు, నెటిజనులు, మీమర్లు పండుగ చేసుకున్నారు. కనీసమైన ప్రాథమిక పరిజ్ణానం లేని వ్యక్తా ఐదేళ్ల పాటు ఏపీ ముఖ్యమంత్రిగా పని చేసింది అంటూ నెట్టింట జగన్ తెగ ట్రోలింగ్ కు గురయ్యారు.  డీఎస్సీకి, ఏపీపీఎస్సీకి మధ్య ఉన్న  తేడా తెలియని వ్యక్తికి రాజకీయాలెందుకు? అంటూ  తెలుగుదేశం  కూటమి నేతలు, నెటిజనులు ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు.  

గతంలో వైసీపీ సోషల్ మీడియా, మీడియా లోకేష్ ఆహార్యం, ఆహారం, భాష ఇలా ప్రతి విషయంలోనూ ట్రోల్ చేసేది. బాడీ షేమింగ్ కు కూడా వెనుకాడేది కాదు. అయితే లోకేష్ తనను తాను మేకోవర్ చేసుకోవడానికి ఆ ట్రోలింగ్ ను ఉపయోగించుకున్నారు. ఇప్పుడు వైసీపీయులకు లోకేష్ విషయంలో పన్నెత్తి మాట్లాడే అవకాశం కూడా దొరకడం లేదు. అందుకు భిన్నంగా వైసీపీ అధినేత జగన్ తన ప్రెస్ మీట్లలో అడ్డంగా దొరికిపోతూ విపరీతంగా ట్రోల్ అవుతున్నారు.

దీంతో వైపీపీయులు జగన్ ప్రెస్ మీట్లకు దూరంగా ఉంటే మేలని అంతర్గత సంభాషణల్లో చెప్పుకుంటున్నారు. ప్రెస్ మీట్ లనేమిటి అసలు బయటకు రాకుండా సైలంట్ గా ఉంటే పార్టీకి మేలు జరుగుతుందనీ,  అలా కాకుండా ఆయన బయటకు వచ్చి మాట్లాడితే ఉన్న కొద్ది పాటి ప్రతిష్ఠ కూడా మంటగలిసేలా ఉందన్న భయం వైసీపీయుల్లో వ్యక్తమతోంది.  

YS Jagan pressmeets worrying YCp, YSRCP Politics, Jagan Press Meet Controversies, AP Politics News, Jagan Mohan Reddy Speeches