Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...జగన్ పిట్టకథ .. రచయిత ఎవరో ?
posted on: Jun 6, 2018 5:49PM

జగన్ ఒక పిట్టకథ చెప్పారు.. అలాంటి ఇలాంటి కథ కాదు.. వినగానే నవ్వొచ్చేలాంటి కథ.. జగన్ పాదయాత్ర చేస్తుంటే ఒక అభిమానొచ్చి.. అన్నా నీ స్పీచ్ లు బాగుంటాయి.. నేనొక కథ రాసాను, నువ్వు చదివితే బాగుంటుంది అన్నాడంట.. ఇక జగన్ ఆగుతారా.. ఆ కథారచయిత పేరు చెప్పలేదు గానీ.. కథ మాత్రం చెప్పడం మొదలుపెట్టారు.. ఇంతకీ కథ ఏంటంటే.. " చంద్రబాబు గారు.. రెండు ఎకరాల నుండి నాలుగు లక్షల కోట్లు సంపాదించారండీ.. హైద్రాబాద్ లో బ్రహ్మాండమైన రాజభవనం కూడా కట్టుకుంటున్నారు అండీ.. చంద్రబాబు గారి వేలికి ఉంగరం ఉండదు.. చేతికి గడియారం ఉండదండి.. మెడలో గొలుసు కూడా ఉండదండీ.. కానీ ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనడానికి 20, 30 కోట్లు ఉంటాయండీ.. బాబు గారికి మందు తాగే అలవాటు లేదండీ.. కానీ ప్రతి ఊరి ఊరిలో వీధి వీధిలో బెల్ట్ షాప్ లుంటాయండీ".. ఇలా అండీ అండీ అంటూ వచ్చి రానీ గోదావరి యాసలో జగన్ పిట్టకథ చెప్పారు.. కథ బాగానే ఉంది జగన్ గారూ.. కానీ... ఇలా కథలు చెప్పడం వల్ల ప్రజలకి ప్రయోజనం ఏంటండీ.. ఇలా కథలు చెప్పడం మానేసి ప్రజలకి మీరేం చేస్తారో చెప్పండండీ.. అర్థమైందనుకుంటా అండీ.. ఇక ఉంటానండీ.. ఆయ్...






