అసెంబ్లీలో తమ ఎమ్మెల్యేలకి అటెండెన్స్ వేయనున్న జగన్ !

 

సంచలన నిర్ణయాలకి కేరాఫ్ గా మారిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అదేంటంటే వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులకు అటెండెన్స్ వేయాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు. అంటే ఈరోజు  నుండి అసెంబ్లీకి ఎవరెవరు వస్తున్నారో ఎవరెవరు రావడంలేదో లెక్క తేల్చాలని కొందరు సీనియర్ లను ఆయన ఆదేశించారని అంటున్నారు. 

ఈ నేపధ్యంలో ఈరోజు నుండే వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులకి అటెండెన్స్ వేయాలని నిర్ణయించారు. ప్రతి సభ్యుడి ఏ టైంకి సభకు వస్తున్నారు.. ? ఎప్పుడు వెళ్తున్నారు ? అన్న సమాచారాన్ని పక్కాగా నమోదు చేయాలని ప్రభుత్వ చీఫ్ విప్‌కి జగన్ ఆదేశాలు జారీ చేశారు. దీనిపై ప్రతిరోజు సాయంత్రం తనకు నివేదిక ఇవ్వాలని కూడా జగన్ ఆదేశించారని అంటున్నారు. సభలో టీడీపీ బలం చాలా తక్కువగా ఉన్నప్పటికీ అధికారపక్షాన్ని వారు దీటుగానే ఎదుర్కొంటున్నారు. 

దానికి కారణం ఏమిటా అని ఆరా తీస్తే టీడీపీ విమర్శలు చేస్తున్న సమయంలో సభలో ఎక్కువ మంది వైసీపీ సభ్యులు ఉండటం లేదని జగన్ నోటీస్ కి వచ్చింది. ఈ నేపథ్యంలోనే తమ సభ్యులకు అటెండెన్స్ వేయాలనే నిర్ణయానికి వచ్చారు. ఎమ్మెల్యేలు హాజరు తీసుకోవడం విప్ ల బాధ్యత అయితే, ఎవరి జిల్లాల వారిని వారు డుమ్మా కొట్టకుండా ఆయా జిల్లాల మంత్రులకి బాధ్యత అప్పగించారు.