TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జగన్ ‘చేయి’ అందుకోనున్నారా?

Published on: Mon Aug 31, 2026 4:07PM

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ‘ చేయి’ అందుకోనున్నారా? గత దశాబ్ద కాలంగా రాజును మించిన రాజభక్తి చందంగా  బీజేపీకి అడుగులకు మడుగులొత్తుతూ ఆ పార్టీతో సఖ్యత చెడకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్న జగన్.. ఇప్పుడు ఆ పార్టీకి పూర్తిగా కటీఫ్ చేప్పేస్తున్నారా? జగన్ రాజకీయ వ్యూహాలను మార్చుకుంటున్నారా?  తాను విభేదించి బయటకు వచ్చిన కాంగ్రెస్ తో చెలిమికి తహతహలాడుతున్నారా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. దశాబ్దకాలంగా బీజేపీతో ఏకపక్షంగా స్నేహం చేసిన జగన్ ఇప్పుడు తన దృష్టిని కాంగ్రెస్ వైపు మళ్లించారంటున్నారు. ఇందుకు వారు ఇటీవల కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ తో జగన్ రహస్య భేటీని ఉదహరిస్తున్నారు. జగన్ ఇటీవల బెంగళూరులో కేసీ వేణుగోపాల్ తో రహస్యంగా భేటీ అయ్యారన్నప్రచారాన్నిపూర్తిగా కొట్టి పారేయలేమని పరిశీలకులు అంటున్నారు.  

హస్తిన ఢిల్లీ పీఠంపై మారిన సమీకరణాలు, ఏపీలో 2024  ఎన్నికల అనంతరం ఏర్పడిన  రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో  జగన్ కేసీ వేణుగోపాల్ తో భేటీ అయ్యారని ప్రచారం జోరుగా సాగుతోంది. ఆ రహస్య భేటీలోనే వైసీపీ జాతీయ స్థాయిలో ఎలాంటి పాత్ర పోషించాలి, రాబోయే రోజుల్లో కాంగ్రెస్‌తో కలిసి ప్రయాణించేందుకు ఉన్న అవకాశాలు? తదితర అంశాలపై విస్తృతంగా చర్చించినట్లు విశ్వసనీయ వర్గాల భోగట్టా. 

రాష్ట్రం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాతవైసీపీ  సవాళ్లను ఎదుర్కొంటోంది. అధికార కూటమిలో బీజేపీ కూడా భాగస్వామిగా ఉండటంతో జగన్ కు గతంలోలా ఢిల్లీ బీజేపీ పెద్దల నుంచి అండ, ఆసరా కరవైంది.  కేంద్రంలో, బీజేపీ అగ్రనేతలలో చంద్రబాబు మాటకే చెల్లుబాటు అధికంగా ఉంటోంది.

అలాగే..   జగన్‌పై గతంలో అక్రమాస్తుల కేసు సహా పలు కేసులు మళ్లీ తెరపైకి వచ్చాయి. వాటి దర్యాప్తును కేంద్ర దర్యాప్తు సంస్థలునమోదైన పాత కేసులు మళ్లీ తెరపైకి రావడం,  దర్యాప్తు సంస్థల విచారణల వేగం పుంజుకోవడం ఆయనలో ఆందోళనను పెంచాయంటున్నారు.  ఈ నేపథ్యంలోనే ఇక కమలనాధులను ప్రాధేయపడుతూ కూర్చోవడం వల్ల ఉపయోగం లేదన్న భావనకు వచ్చిన ఆయన.. రాజకీయంగా రాష్ట్రంలో తాను, తన పార్టీ బలోపేతం కావాలంటే.. ‘హస్తం’ చేయి అందుకోవడం వినా మరో మార్గం లేదని భావిస్తున్నట్లు చెబుతున్నారు.  

బెంగళూరు వేదికగా కేసీ వేణుగోపాల్ తో జరిగినట్లు చెబుతున్న రహస్య భేటీ  ఈ నేపథ్యంలోనే  ప్రాధాన్యత సంతరించుకుంది. పుష్కర కాలంగా కేంద్రంలో  అధాకారంలో ఉన్న బీజేపీతో సత్సంబంధాలు కొనసాగించిన జగన్ ఇప్పుడు తాను కమలం పార్టీకి కటీఫ్ చెప్పడం వెనుక   రాజకీయ వ్యూహం ఉందంటున్నారు పరిశీలకులు..   సమయంలో జాతీయ స్థాయిలో మోడీ వ్యతిరేక కూటమికి మద్దతు ఇవ్వడం ద్వారా తన రాజకీయ ప్రతిష్ట పెరుగుతుందని జగన్ భావిస్తున్నట్లు కనిపిస్తోంది. 

[YS Jagan Mohan Reddy secreat Meeting With KCVenugopal,  BJPTies Severed, Congress Party, INDIA Alliance, Bengaluru]