జ‌గ‌న్ బెయిల్‌పై 23న తీర్పు

 

Jagan bail, ys Jagan mohan reddy bail, Jagan assets case, Jagan bail cbi

 

 


జ‌గ‌న్ బెయిల్ పిటిష‌న్ వాద‌న‌లు విన్న కోర్టు తీర్పును ఈ నెల 23కు వాయిదా వేసింది. సుప్రిం కోర్టు ఇచ్చిన గ‌డువు లోగా విచార‌ణ పూర్తిచేశామ‌ని తెలిపిన సిబిఐ జ‌గ‌న్‌కు బెయిల్ ఇవ్వవ‌ద్ద‌ని కోర్టు తెలిపింది.

 

 

రాజ‌కీయంగా బ‌ల‌మైన బ్యాక్‌గ్రౌండ్‌తో పాటు గ‌తంలో జైళు నుంచే నిరాహారా దీక్ష కూడా చేశాడ‌నే కార‌ణాల‌ను చూపించిన సిబిఐ జ‌గ‌న్‌కు బెయిల్ ఇవ్వ‌వ‌ద్ద‌ని కోర్టుకు తెలిపింది. జ‌గ‌న్ త‌రుపు న్యావాది మాత్రం సుప్రిం కోర్టు ఇచ్చిన గ‌డువు ముగిసినందున జ‌గ‌న్‌కు బెయిల్ ఇవ్వ‌వ‌చ్చ‌ని వాదించారు. రాజ‌కీయ నేప‌థ్యాన్ని కార‌ణంగా చూపించి ఓ వ్య‌క్తికి బెయిల్ నిరాక‌రించ‌డం రాజ్యాంగ విరుద్దం అని కోర్టుకు విన్న‌వించారు.

 

 

అయితే ఇరు ప‌క్షాల వాద‌న‌లు విన్న న్యాయ‌స్థానం తీర్పును ఈ నెల 23కు వాయిదా వేసింది.అయితే జ‌గ‌న్ త‌రుపున ఆయ‌న భార్య భార‌తి కోర్టు హాజ‌ర‌య్యారు. వాద‌న‌లు పూర్త‌యిన అనంత‌రం ఈ సారి త‌ప్ప‌కుండా బెయిల్ వ‌స్తుందన్న ఆశాభావం వ్య‌క్తంచేశారు వైసిపి నాయ‌కులు. జ‌గ‌న్ బెయిల్ పిటీష‌న్ వేయ‌టం ఇది తొమ్మిదో సారి.