TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తుస్సుమన్న వైసీపీ నిరసనలు.!

Published on: Mon Aug 10, 2026 12:31PM

ఏపీలో ఇప్పుడు డీఎస్సీ లో అక్రమాలకు వ్యతిరేకంగా  వైసీపీ చేపట్టిన నిరసనలు, దీక్షలు రాష్ట్రంలో ఆ పార్టీ ఉనికి కోసం డిస్పరేట్ గా చేస్తున్న ప్రయత్నాలుగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. కాగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ కూడా కొద్ది కొద్దిగా క్రియాశీలంగా మారుతున్నారు. వారం అంతా బెంగళూరు ప్యాలెస్ కే పరిమితమై చుట్టపు చూపుగ వారంతంలో ఓ సారి రాష్ట్రానికి వస్తున్న జగన్.. డీఎస్సీకి వ్యతిరేకంగా నిరసనలకు పిలుపునిచ్చారు.

బహుశా రాష్ట్రంలో అధికారం కోల్పోయిన తరువాత తన జైలుపరామర్శ యాత్రలు కాకుండా.. పార్టీ  ఓ కార్యక్రమం చేపట్టేలా జగన్ ఇచ్చిన తొలి పిలుపు ఇదే కావచ్చు. అధినేత జగన్ స్వయంగా పిలుపునివ్వడం వల్ల.. ఆ పార్టీ సీనియర్లు కూడా కొద్ది సేపు తన రాజకీయ అజ్ణాత వాసానికి విరామం ప్రకటించి జనంలోకి వచ్చారు. డీఎస్సీకి వ్యతిరేకంగా వైసీపీ నిర్వహించిన నిరసనలు, దీక్షలలో ఆ పార్టీ సీనియర్ నేతలు, జగన్ అధికారంలో ఉండగా ప్రభుత్వంలో, పార్టీలో కీలకంగా వ్యవహరించి, ఫైర్ బ్రాండ్ మహిళా నేతలుగా గుర్పింపు పొందిన రోజా, విడదల రజనీ వంటి వారు కూడా వీధుల్లోకి వచ్చి నిరసన తెలిపారు. 


అయితే ఇక్కడ వైసీపీ మిస్సయిన లాజిక్ ఏమిటంటే. మెగా డీఎస్సీ   ప్రక్రియ ఇప్పటికే పూర్తయ్యింది. , మెగా డీఎస్సీ పట్ల యువతలో బై అండ్ లార్జ్ హర్షం వ్యక్తం అవుతోంది. నియామక ప్రక్రియ పారదర్శకంగా ఉందన్న భావనే సర్వత్రా గట్టిగా వ్యక్త మౌతోంది. డీఎస్సీకి వ్యతిరేకంగా వైసీపీ నిరసనలకు వ్యతిరేకంగా జగన్ ఖిల్లా అయిన కడపలో యువత రోడ్డెక్కారు. వైసీపీ చేపట్టిన నిరసన, దీక్షలు పూర్తిగా అసంబద్ధమనీ, జగన్ అధికారంలో ఉన్న ఐదేళ్లూ ఒక్కటంటే ఒక్క ఉద్యోగ ప్రకటన వెలువడలేదని ఈ సందర్భంగా ఈ సందర్భంగా యువత పేర్కొన్నారు. అది పక్కన పెడితే.. స్వయంగా తాను ఇచ్చిన పిలుపు మేరకు జరుగుతున్న నిరసనలలో జగన్ ఎక్కడా కనిపించలేదు.  దీంతో వైసీపీ నిరసనలు తుస్సు మన్నాయి.

జగన్ గైర్హాజర్ తో ఈ నిరసన కార్యక్రమానికి మీడియా కూడా ఏమంత ప్రాధాన్యత ఇవ్వలేదు. నెటిజనులు కూడా పట్టించుకోలేదు. దీంతో వైసీపీ నిరసనలకు  పొలిటికల్ గా ప్రాధాన్యతా లభించలేదని పరిశీలకులు అంటున్నారు. రోజా, విడదల రజని వంటి వారు బయటకు వచ్చి నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నప్పటికీ.. వారి ప్రసంగాలలో మునుపటి ఫైర్ కనిపించలేదు. జగన్ పిలుపునిచ్చారు కనుక ఓ సారి ముఖం చూపిస్తే సరిపోతుందన్నట్లుగా వారి తీరు ఉంది.  దీంతో ఉనికి కోసం చేపట్టిన ఈ నిరసన కార్యక్రమాలు ఆశించిన ఫలితం ఇవ్వలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

YS Jagan Mohan Reddy, YSRCP Protests, AP DSC Irregularities, AP Political News, Jagan Absence