TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జగన్ వర్గ ఎమ్మెల్యేలపై ఏ క్షణమైనా వేటు

Published on: Sat Feb 18, 2012 3:12PM

హైదరాబాద్: జగన్ కు అండగా నిలిచినా ఎమ్మెల్యేలపై వేటు వేసేందుకు కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. వారిపై వేటు వేసి ఎటువంటి అధికారం లేకుండా చేయడం, అదే సమయంలో ఆ నియోజకవర్గాల్ల్లో కాంగ్రెస్ అభ్యర్ధులను ఎంపిక చేసి 6 నెలల పాటు వారి ద్వారా పార్టీని పటిష్టంచేసి అనంతరం ఎన్నికలకు వెళ్ళేలా పక్కా ప్రణాళిక  రచించింది. ఎట్టి పరిస్థితుల్లో వీరి వేటు ద్వారా వచ్చే ఉపఎన్నికల్లో కాంగ్రెస్ బలం ఏమిటో చూపాలని చూస్తోంది. ఇప్పుడు ఉప ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదలైపోవడంతో జగన్ వర్గ ఎమ్మెల్యేలపై ఏ క్షణమైనా వేటుపడే అవకాశాలున్నాయి.