గవర్నర్ తో జగన్ భేటీ

 

ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ఈరోజు మధ్యాహ్నం ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్‌ను రాజ్ భవన్ లో కలిశారు. ఏపీలో ఓట్ల తొలగింపు, ఓటర్ల జాబితాలో అవకతవకలపై జగన్ నరసింహన్‌కు ఫిర్యాదు చేశారు. అందుకు సంబంధించిన వివరాలను అందజేశారు. అలాగే పోలీస్ అధికారుల పదోన్నతుల్లో అక్రమాలపై చర్యలు తీసుకోవాలని జగన్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.  కాగా ఎన్నికలు సజావుగా జరగాలంటే డీజీపీ ఠాకుర్, ఇంటెలిజెన్స్‌ ఐజీ వెంకటేశ్వర రావు, డీఐజీ ఘట్టమనేని శ్రీనివాస్‌రావును వెంటనే బదిలీ చేయాలని కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈసీ) సునీల్‌ అరోరాను ఢిల్లీలో వైఎస్‌ జగన్‌ కోరిన విషయం తెలిసిందే.   జగన్‌తో పాటు గవర్నర్‌ను కలిసినవారిలో ఆ పార్టీ నేతలు విజయసాయిరెడ్డి, ధర్మాన ప్రసాదరావు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తదితరులు ఉన్నారు.