TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

ఏపీ కేబినెట్‌లో సీఎం జగనే రిచ్.. ఆస్తి ఎంతో తెలుసా?

Published on: Wed Jun 26, 2019 11:10AM

 

ఏపీ కేబినెట్‌లో అత్యంత ధనవంతుడు సీఎం వైఎస్ జగన్ అని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫార్మ్స్ (ఏడీఆర్) తెలిపింది. కేబినెట్‌లోని 26 మంది సమర్పించిన ఎన్నికల ప్రమాణ పత్రాలను పరిశీలించిన అనంతరం ఏడీఆర్ ఓ జాబితాను విడుదల చేసింది. దాని ప్రకారం.. సీఎం జగన్ రూ.510 కోట్ల ఆస్తులతో అగ్రస్థానంలో ఉండగా, రూ.130 కోట్లతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రెండో స్థానంలో నిలిచారు. రూ.61 కోట్లతో మేకపాటి గౌతంరెడ్డి మూడో స్థానంలో ఉన్నారు.

జగన్ కేబినెట్‌లోని 26 మంది మంత్రుల్లో 23 మంది అంటే 88 శాతం మంది కోటీశ్వరులేనని ఏడీఆర్ నివేదిక పేర్కొంది. మంత్రుల సగటు ఆస్తి రూ.35.25 కోట్లుగా వివరించింది. కేబినెట్‌లోని 17 మంది మంత్రులపై  క్రిమినల్ కేసులు ఉండగా, వీరిలో 9 మందిపై తీవ్రమైన అభియోగాలు నమోదైనట్టు పేర్కొంది. అప్పుల విషయంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అందరికంటే ముందున్నారు. ఆయనకు రూ.20 కోట్ల అప్పులున్నాయి.  చెరుకువాడ శ్రీరంగనాథరాజుకు రూ.12 కోట్లు, అవంతి శ్రీనివాస్ కు రూ.5 కోట్లు అప్పు ఉన్నట్టు ఏడీఆర్ తన నివేదికలో పేర్కొంది.