వైఎస్ రాజశేఖరరెడ్డి వేరు, జగన్ వేరు అంటున్న రాహుల్ గాంధీ

రాష్ట్ర విభజన తరువాత ఏపీలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది.. అయితే దేశ వ్యాప్తంగా మళ్ళీ పుంజుకుంటున్న కాంగ్రెస్, ఇప్పుడు ఏపీ మీద కూడా దృష్టి పెడుతుంది.. ఇప్పుడిప్పుడే ఏపీలో ఉనికిని చాటుకుంటున్న కాంగ్రెస్, మళ్ళీ బలమైన పార్టీగా అవతరించాలని చూస్తుంది.. దానిలో భాగంగానే రాహుల్ గాంధీ, ఏపీ కాంగ్రెస్ నేతలతో సమావేశమై భవిష్యత్తు కార్యాచరణ గురించి చర్చించారు.

రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి ఊమెన్ చాందీ, పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డితో పాటు కొందరు ముఖ్యనేతలతో సమావేశమైన రాహుల్, జగన్ గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తుంది.. 'వైఎస్ రాజశేఖరరెడ్డి వేరు, జగన్ వేరు.. రాజశేఖరరెడ్డి నిరుపేదల గురించి ఆలోచించేవారు, కానీ జగన్ వ్యక్తిగత ప్రయోజనాల కోసమే ఆలోచిస్తాడు.. కాంగ్రెస్ ఎప్పుడూ నిరుపేదలకు అండగా ఉంటుంది.. జగన్ స్వభావం ఇందుకు విరుద్ధం.. అందుకే మనం జగన్ ని కూడా టార్గెట్ చేయాలి.. జగన్ పార్టీలో ఉన్న కీలక నేతలంతా కాంగ్రెస్ భావజాలం ఉన్నవాళ్లే, వాళ్ళని తిరిగి కాంగ్రెస్ లోకి ఆహ్వానించాలి' అని రాహుల్ అన్నారట.. మొత్తానికి రాహుల్ ఏపీ మీద బాగానే దృష్టి పెట్టారుగా.