మహాత్మా గాంథీ తో జగన్‌కు పోలికా?
Published on: Thu Aug 16, 2012 10:37AM
వైకాపా అథినేత జగన్మోహనరెడ్డిని గాంథీజీతో పోలుస్తూ గుంటూరు లార్జ్‌సెంటరులో నెలకొల్పిన ఫ్లెక్సీ వివాదాలు సృష్టిస్తోంది. వైఎస్‌ఆర్‌కాంగ్రెస్ పార్టీ నేత శ్రీనివాసరావు తన స్వామిభక్తిని నిరూపించుకునేందుకు ఈ ఫ్లెక్సీని తయారు చేయించారు. నగరమంతా ఈ ఫ్లెక్సీలు కలకలం సృష్టిస్తున్నాయి. అక్రమాస్తుల కేసులో అరెస్టు అయి జైలులో ఉన్న జగన్‌ను ఉద్దేశించి రూపొందించిన ఈ ఫ్లెక్సీ తయారు చేసిన తీరుపై అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి.
జాతి మొత్తం గర్వించే మహాత్ముడిగా ప్రపంచదేశాల ప్రసంశను అందుకున్న గాంథీజీతో జగన్‌ను పోల్చటం అమానుషమైన చర్య అని సామాజికవాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఈ ఫ్లెక్సీలు తొలగించాలని పలువురు డిమాండు చేస్తున్నారు. ఫ్లెక్సీల్లో ఈ కింది విథంగా రాయటమే వివాదానికి హేతువైంది.
‘‘తెల్లదొరల పాలనలో గాంథీజీ జైలుకు వెళితే...ఈనాడు నల్లదొరల పాలనలో జగనన్న జైలుకు వెళ్లాడు...ఓ గాంథీ న్యాయం ఎక్కడ?’’ అని ఫ్లెక్సీలో రాశారు. ఈ వివాదస్పద ఫ్లెక్సీలపై స్పందించిన కార్పొరేషను అథికారులు వాటిని తొలగించారు.


