నెక్స్ట్ టార్గెట్ సుజనా.. ఆస్తుల చిట్టా కోసం చెట్టు, పుట్టలలో వెదుకులాట !

 

ఎపి సీఎం జగన్ అమరావతి లో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఐతే అధికారం లోకి వచ్చి 100 రోజులు పూర్తైనా ఇంతవరకు ప్రభుత్వం ఎటువంటి ఆధారాలు చూపలేక పోయింది. ఇది ఇలా ఉంటె సుజనా చౌదరి, అయన బంధువుల భూములంటూ మంత్రి బొత్స కొన్ని వివరాలు ప్రకటించారు కానీ అవి తమకు ఎప్పుటి నుండో వారసత్వంగా వస్తున్నవని సుజనా స్పష్టం చేయడంతో ప్రభుత్వం నుండి స్పందన లేదు. ఐతే ఇపుడు తాజాగా అయన భూముల లావాదేవీల వివరాల కోసం వారం రోజులుగా రెవెన్యూ, సిఐడి, విజిలెన్స్, ఎసిబి అధికారులు పెద్ద ఎత్తున కృష్ణా జిల్లా కంచికచర్ల మండలంలోని పలు గ్రామాల పరిధిలో పర్యటించి భూముల అంశంపై రహస్యంగా ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తోంది. రాష్ట్రం విడిపోయిన తరువాత, అలాగే అమరావతి రాజధాని ప్రకటన కు ముందు అక్కడ జరిగిన భూ లావాదేవీల గురించి స్థానిక రైతులు, దళారీల నుండి సమాచారం సేకరించినట్లుగా తెలుస్తోంది. ఐతే ఆ మధ్య టీడీపీ అధికారం లో ఉన్నపుడు టీడీపీ నేతలు కొనుగోలు చేసిన భూముల వివరాలు సర్వే నంబర్లతో సహా ఇవిగో అంటూ తమ మీడియాలో వరుసగా ప్రచురించిన వివరాలు బయట పెడితే సరిపోతుంది కదా అని కొంత మంది అంటుంటే బహుశా అది కేవలం రాజకీయం కోసం చేసిన స్టంటు మాత్రమేనెమో అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.