వైఎస్ జగన్ కు బెయిల్

 

jagan gets bail, ys jagan gets interim bail, jagan interim bail

 

 

వైఎస్ఆర్.కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి నాంపల్లి సీబీఐ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 484 రోజులుగా వైఎస్ జగన్ హైదరాబాద్ చంచల్ గూడ జైలులో వున్నారు. మధ్యాహ్నం నుండే జగన్మోహన్ రెడ్డి భార్య భారతి తదితరులు కోర్టుకి చేరుకొని తీర్పుకోసం ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా వైకాపా కార్యకర్తలు, నేతలు కూడా చాలామంది తరలివచ్చారు.

 

 

జగన్ కి బెయిల్ లభించడంతో రాష్ట్ర రాజకీయ సమీకరణాలు మారే అవకాశం వుంది. కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర విభజన నిర్ణయంతో తమ రాజకీయ భవిష్యత్తును నాశనం చేసిందని ఆగ్రహంతో ఉన్న అనేకమంది సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు ఆ పార్టీని వీడి వైకాపాలోకి దూకవచ్చును. అదేవిధంగా సమైక్యాంధ్ర పధం నోట నుండి ఉచ్చరించని చంద్రబాబుపై కూడా కినిసిన తెలుగు తమ్ముళ్ళు కూడా వైకాపాలోకి దూకే అవకాశం ఉంది.