TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

బీజేపీలోకి 15 మంది ఎమ్మెల్యేలు.. ఆందోళనలో జగన్!!

Published on: Sat Jun 22, 2019 3:50PM

 

టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. వీరిబాటలోనే పలువురు నేతలు టీడీపీని వీడి బీజేపీలో చేరనున్నారని వార్తలొస్తున్నాయి. చంద్రబాబుకి అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా ఊడిపోతుందనీ, టీడీపీకి చెందిన కనీసం 15 మంది ఎమ్మెల్యేలు బీజేపీలోకి చేరిపోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబుకి, పార్టీ శ్రేణులకు ఆందోళన కలగడం సహజం. అయితే అందుకు భిన్నంగా వారికంటే ఎక్కువగా వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ ఆందోళన చెందుతున్నారట.

అదేంటి.. టీడీపీ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరితే జగన్ కి ఎందుకు ఆందోళన అనుకుంటున్నారా? అక్కడే ఉంది అసలు ట్విస్ట్. వైసీపీకి అసెంబ్లీలో 151 సంఖ్యా బలం ఉంది. ప్రతిపక్ష టీడీపీకి కేవలం 23 మంది ఎమ్మెల్యేలే ఉన్నారు. దీంతో వైసీపీ టీడీపీని అసెంబ్లీలో ఓ ఆట ఆడుకుంటుంది. ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యేలు చేరి బీజేపీకి ప్రతిపక్ష హోదా వస్తే.. అసెంబ్లీలో వైసీపీ ఆటలు సాగవు. ఎందుకంటే.. కేంద్రంలో వున్నది బీజేపీ. నిధులు, హోదా వంటివన్నీ బీజేపీతో సన్నిహితంగా ఉండి సాధించుకోవాలి. అంటే బీజేపీని ఏమీ అనలేని పరిస్థితి. మరి ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యేలు కాస్తా బీజేపీ ఎమ్మెల్యేలుగా మారిపోతే.. వారు ఏమన్నా వారిని మాత్రం ఏం అనకూడదు. ఇది జగన్ కి పెద్ద తలనొప్పిగా మారిపోతుంది. అందుకే జగన్ టీడీపీ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరబోతున్నారంటే ఆందోళన చెందుతున్నారట.