జగన్ డ్రీం కేబినెట్.. ఎవరెవరికి ఏయే శాఖలంటే?

 

ఏపీలో తమదే అధికారమని వైసీపీ నమ్మకంగా చెబుతోంది. రాజకీయ విశ్లేషకులు కూడా ఏపీలో వైసీపీనే అధికారంలోకి వచ్చే అవకాశముందని అభిప్రాయపడుతున్నారు. దీంతో ఫలితాలు రాకముందే వైసీపీ శ్రేణులు ఉత్సాహంగా ఉన్నాయి. ఇప్పటికే సోషల్ మీడియాలో వైఎస్ జగన్ పేరుతో సీఎం నేమ్ ప్లేట్ కూడా చక్కర్లు కొట్టింది. అంతేకాదు కొందరు జ్యోతిష్యులు జగన్ సీఎంగా ప్రమాణస్వీకారం పలానా రోజు చేస్తే బాగుంటుందంటూ ముహూర్తం పెట్టారు. అయితే ఇప్పుడు ఏకంగా వైఎస్ డ్రీం కేబినెట్ ఇదేనంటూ సోషల్ మీడియాలో ఓ లిస్ట్ చక్కర్లు కొడుతోంది. ఇన్ని రోజుల వరకు వైసీపీ అధికారంలోకి వస్తే.. ఆ నేతకు మంత్రి పదవి, ఈ నేతకు మంత్రి పదవి అని మాత్రమే ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు మాత్రం ఆ శాఖల మంత్రులు వీరేనంటూ సోషల్ మీడియాలో ఓ లిస్ట్ వైరల్ అవుతోంది.

ముఖ్యమంత్రి : వై యస్ జగన్మోహన్ రెడ్డి

స్పీకర్ : దగ్గుబాటి వెంకటేశ్వర రావు

డిప్యూటీ స్పీకర్ : పాముల పుష్ప శ్రీవాణి

మంత్రులు                         శాఖలు

1.పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి      -హోంశాఖ
2. బొత్స సత్యనారాయణ          - రోడ్లు మరియు భవనాలు
3. ధర్మాన ప్రసాదరావు             -రెవెన్యూశాఖ
4. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి      -ఆర్థిక శాఖ
5. కొడాలి నాని                          -భారీ నీటిపారుదల శాఖ
6. కురసాల కన్నబాబు             -విద్యాశాఖ
7. తానేటి వనిత                       -స్త్రీ, శిశు సంక్షేమ శాక   
8. ఆనం రాంనారాయణ రెడ్డి    -పంచాయితీరాజ్
9. అవంతి శ్రీనివాస్                  -వైద్య ఆరోగ్యశాఖ
10. గడికోట శ్రీకాంత్ రెడ్డి              -మున్సిపల్ శాఖ
11. ఆళ్ళ రామకృష్ణ రెడ్డి            -వ్యవసాయ శాఖ మంత్రి
12. శిల్ప చక్రపాణి రెడ్డి              -అటవీశాఖ
13. వై. విశ్వేసర్ రెడ్డి                 -న్యాయశాఖ  
14. కోన రఘుపతి                      -దేవాదాయ ధర్మదాయశాఖ
15. పిల్లి సుభాష్ చంద్రబోస్      -పౌర సరఫరాలుశాఖ
16. మోపిదేవి వెంకటరమణ      -ఐటీ శాఖ మంత్రి
17. ఆర్. కే. రోజా                       -విద్యుత్ శాఖ  
18. బాలినేని శ్రీనివాస్ రెడ్డి         -భూగర్భ గనులశాఖ
19. గ్రంధి శ్రీనివాస్                    -సినిమాటోగ్రఫీ
20. ఆళ్ళ నాని                           -కార్మిక, రవాణా శాఖ
21. కె. భాగ్యలక్ష్మి                       - సాంఘీక సంక్షేశాఖ
22. తమ్మినేని సీతారాం             -బీసీ సంక్షేమం
23. అమంచి కృష్ణ మోహన్        -మార్కెటింగ్ మరియు పశు సంవర్థక
24. కె. ఇక్బాల్ అహ్మద్              -పర్యావరణ శాఖ
25. కొక్కిలిగడ్డ రక్షణనిధి           -హౌసింగ్
26. కాకాని గోవర్ధన్ రెడ్డి               -భారీ పరిశ్రమల శాఖ