TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

'జగన్ అక్రమాస్తుల విలువ రూ. 2,500 కోట్లు'

Published on: Fri Jun 1, 2012 11:50AM

వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహనరెడ్డి అక్రమాస్తుల విలువ కట్టే పనిలో సిబీఐ, ఇడి (ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్) ఉన్నాయి. దీనిలో భాగంగా ఆధారాలతో సహా ఇడి అంచనా ప్రకారం జగన్ అక్రమంగా సంపాదించిన ఆస్తుల విలువ రూ. 2,500కోట్లు. ఇదే విషయాన్ని ఇడి తన ఈసీఐఆర్ (ఎన్ ఫోర్స్ మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్టు)లో పేర్కొంది. జగన్ తో సహా 73మంది నిందుతులను ఇడి గుర్తించింది. జి.శ్రీనివాసరాజు, కె.శ్రీనివాసనాయుడు, కె. ప్రసాద్ రెడ్డి, డి.శ్రీనివాసులురెడ్డి, విజయసాయిరెడ్డితో సహా దాదాపు 12మంది పారిశ్రామికవేత్తలు, జగన్ సన్నిహితులు నిన్డుతులుగా ఇడి పేర్కొంది. తన తండ్రి అధికారాన్ని ఉపయోగించుకుని జగన్ తన కంపెనీలో షేర్లు కొనాలని ఒత్తిడి చేశారని ఇడీ ప్రధాన ఆరోపణగా పేర్కొంది. ఇడి ముందుగా జగన్ ఆస్తుల జప్తునకు రంగం సిద్ధం చేస్తోందని సమాచారం. ఈ మేరకు అన్నిరకాల ప్రయత్నాలు చేస్తోందని తెలుస్తోంది.