ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే ఇదేనా.... పవన్ ను చంపేస్తా..

 

ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్... ఈ స్టేట్ మెంట్ ఒకప్పుడు ఎవరికి అంతగా తెలిసిఉండకపోవచ్చు కానీ... ఓ సినిమా క్రిటిక్ పుణ్యమా అని అందరికీ దాని డెఫినేషన్ ఏంటో అర్థమయిపోయింది. ఇక సోషల్ మీడియా ద్వారా ఈ ఫ్రీడమ్ మరీ ఎక్కువైపోయింది. ఎవరికి నచ్చినట్టు వారు మాట్లాడటం... వీడియో తీయడం సోషల్ మీడీయాలో పెట్టడం.. ఎమన్నా అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని చెప్పడం. గత కొద్ది రోజులుగా.. ఈ హంగామా మరీ ఎక్కువైపోయింది. అలాంటి నిర్వాకమే చేసి ఓ పెద్ద మనిషి ఆఖరికి అరెస్ట్ కావాల్సి వచ్చింది.

 

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారసత్వ రాజకీయాల గురించి ప్రస్తావిస్తూ... వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పై పరోక్షంగా సెటైర్లు వేశారు. ఇక అప్పటినుండి పవన్ కళ్యాణ్ పై వైసీపీ పార్టీ నేతలు, ఆయన అభిమానులు పవన్ పై ఓ రేంజ్ లో విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక వెంకటరెడ్డి అనే ఓ అభిమాని అయితే ఏకంగా పవన్ ను చంపడానికైనా సిద్ధమంటూ ఆవేశంగా నోరు పారేసుకున్నాడు. “జగన్ తో పోలిస్తే పవన్ కల్యాణ్ కోన్ కిస్కా గొట్టంగాడని, జగనన్నను ఏమైనా అంటే చంపడానికైనా, చావడానికైనా సిద్ధమేనని, పవన్ అనే వ్యక్తి బబర్దస్త్ హైపర్ ఆదితో సమానమని… జగన్ అయితే ప్రజలకు దేవుడితో సమానమని, ఆయన ఫొటోలను ఇంట్లో పెట్టుకుంటారని, తనది గుంటూరని, చేతనైతే పవన్ సైన్యం వచ్చి తనను ఎదుర్కోవాలంటూ సవాల్ విసురుతూ” ఓ సెల్ఫీ వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసాడు. ఇంకేముంది వ్యాఖ్యలపై గుంటూరు శివార్లలోని నల్లపాడు పోలీసులు సుమోటో కేసు నమోదు చేసి వెంకటరెడ్డిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం బాబు కటకటాలు లెక్కిస్తున్నాడు. మొత్తానికి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్.. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటూ.. ఎవరికి వారు దాని అర్ధాన్నే మార్చేస్తున్నారు. మరి ఓ హద్దు వరకూ మాట్లాడితే ఓకే కానీ... ఇవి హద్దులు దాటితేనే చాలా కష్టం. అవి తిరిగి తమ మెడకే చుట్టుకుంటాయన్న విషయం నేటి యువత అర్ధం చేసుకుంటే మంచిది...