దాసరిని జగన్ గోకడం కరెక్టేనా..?
Published on: Fri Jan 8, 2016 10:49AM

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి, దాసరి నారాయణరావులు భేటీ ఆయిన సంగతి తెలిసిందే. వీళ్లద్దరు భేటీ అవడంతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. జగన్ దాసరిని తన పార్టీలోకి ఆహ్వానించడం.. దాసరి కూడా దానికి సముఖత చూపడం.. అంతేకాదు దాసరి కూడా జగన్ ను పొగడటంతో ఇక దాసరి వైసీపీలోకి చేరడమే తరువాయి భాగం అని అందరూ చర్చించుకుంటున్నారు. అయితే ఉన్న పళంగా జగన్ దాసరిని పార్టీలోకి ఆహ్వానించడానికి గల కారణం ఎవరో కాదు పవన్ కళ్యాణ్ అని రాజకీయ విశ్లేషకులు చెప్పకనే చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసేందుకే దాసరిని జగన్ అప్రోచ్ అయ్యారని అంటున్నారు.
అయితే జగన్ దాసరిని కలవడం.. అతనిని పార్టీలోకి ఆహ్వానించడం.. అవసరమైతే ఆయనకు రాజ్యసభ టికెట్ ఇవ్వడానికి కూడా రెడీ అవ్వడంపై ఆయనకు ఉన్న రాజకీయ పరిణతి ఏమిటో అర్ధమవుతుందని అంటున్నారు. ఎందుకంటే టీడీపీ-బీజేపీలకు కాపు ఓట్లు సాధించిపెడుతున్న పవన్ కళ్యాణ్ కు పోటీగా దాసరిని రంగంలోకి దింపాలన్నది జగన్ ప్లాన్. అయితే పవన్ కళ్యాణ్ కు పోటీగా ఇంకా వేరే ఎవరినైనా జగన్ ఎంచుకుంటే బావుండేదని.. ప్రస్తుతం దాసరికి ఇమేజ్ లేదు.. అందులోనూ ఇప్పటికే దాసరి బొగ్గు గనుల కేటాయింపులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు..ఆయన వల్ల పార్టీకి కొత్తగా వచ్చేది కూడా ఏం లేదు.. చెప్పాలంటే పార్టీ వల్లే అతనికి ఇంకా ఎక్కువ లాభం చేకూరుతుందే తప్ప వేరే ఏం లేదని రాజకీయ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. దీంతో జగన్ ఎలాంటి కాలిక్యూలేషన్స్ లేకుండానే నిర్ణయాలు తీసుకుంటున్నారని.. దాని వల్ల పార్టీకి చెడ్డ పేరు కూడా వస్తుందని.. అనుకుంటున్నారు.


