జగన్‌పై ఫేస్‌బుక్‌లో అభ్యంతరకర పోస్ట్..

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి‌పై సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టు నమోదైంది. కృష్ణాజిల్లా మొవ్వ మండలం కోసూరుకు చెందిన పరుచూరి సురేష్ కుమార్ ఇటీవల జగన్‌పై తన ఫేస్‌బుక్‌ పేజీలో అభ్యంతరకర పోస్ట్ పెట్టాడు. ఇది సోషల్ మీడియాలో షేర్ అవుతూ పామర్రు వైసీపీ ఇన్‌చార్జ్ అనిల్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఫేస్‌బుక్ ఖాతా ఆధారంగా దర్యాప్తు చేసి.. సురేష్‌ని నిందితుడిగా గుర్తించారు. త్వరలోనే అతడిని అరెస్ట్ చేస్తామని పోలీసులు పేర్కొన్నారు.