TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

కొత్త అసెంబ్లీపై జగన్ కామెంట్స్...గవర్నర్ వాటిపై మాట్లాడలేదు...

Published on: Mon Mar 6, 2017 3:41PM


ఏపీ రాజధాని అమరావతిలో నిర్మించిన నూత‌న అసెంబ్లీ భ‌వ‌నంలో ఈరోజు అసెంబ్లీ సమావేశాలు జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ సందర్భంగా ప్రతిపక్ష పార్టీ నేత, వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి నూతన అసెంబ్లీలోని తన ఛాంబర్‌లోకి ప్రవేశించారు. అసెంబ్లీ నిర్మాణం గురించి మాట్లుడుతూ... అసెంబ్లీ బాగానే ఉందని..అయితే, బయట గదులన్నీ చాలా ఇరుకుగా ఉన్నాయని అన్నారు. అంతేకాదు నూత‌నంగా నిర్మించిన ఆ అసెంబ్లీ భవనాన్ని తాత్కాలికంగా ఉంచడం కంటే శాశ్వతంగా ఉంచితేనే బాగుంటుంద‌ని కూడా అభిప్రాయం వ్య‌క్తం చేశారు.

 

ఇదిలా ఉండగా అసెంబ్లీలో గవర్నర్ నరసింహన్ ప్రసంగంపై.. ఇంకా ముఖ్యమంత్రి చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. తొలి రోజు అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రజా సమస్యలపై మాట్లాడలేదు.. గవర్నర్ తో సీఎం అబద్దాలు చెప్పించారని.. చంద్రబాబు రాసిందే గవర్నర్ చదివారని... గవర్నర్ ప్రసంగంపై రేపు అసెంబ్లీలో మాట్లాడతానని అన్నారు. అంతేకాదు రాష్ట్రం కరువుతో అల్లాడుతుంటే.. అభివృద్ధిలో దూసుకుంటుపోతుందటూ అసత్యాలు చెబుతున్నారు అంటూ విమర్శించారు.