వైసీపీ పోటీ చేయకపోవడంపై శివకుమార్ ఫైర్
Published on: Thu Jan 14, 2016 1:01PM
.jpg)
గ్రేటర్ ఎన్నికల్లో వైకాపా పోటీ చేయడం లేదంటూ.. జగన్ జెండా పీకేసినట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే వైసీపీ తీసుకున్న నిర్ణయం మాత్రం ఆ పార్టీ నేతలకే నచ్చడంలేదు. ఈ విషయాన్ని బహిరంగంగానే వ్యక్తపరుస్తున్నారంట. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు శివకుమార్ ఈ నిర్ణయంపై తన అసంతృప్తిని ప్రకటించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండటం ఇది ఏకపక్ష నిర్ణయమేనని.. ఎన్నికల్లో పోటీ చేయడం లేదని వైసీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించడంతో మనస్థాపానికి గురయ్యానని అన్నారు. అసలు ఎవరితో చర్చించకుండా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏకపక్షంగా తనకు తాను నిర్ణయాలు ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. అయితే మరోవైపు మాత్రం జగన్ నిర్ణయంతోనే పొంగులేటి ప్రకటన చేశారని రాజకీయ విశ్లేషకులు అనుకుంటున్నారు.


