మ‌రోరెండు చార్జీషీట్లు

 

రేపో మాపో ఆఖ‌రి చార్జీషీట్ వేస్తార‌న్న ఆశ‌తో ఉన్న జ‌గ‌న్ ఆశ‌ల‌పై సిబిఐ మ‌రోసారి నీళ్లు చ‌ల్లింది. ఆఖ‌రి చార్జీషీట్‌కు బ‌దులుగా మ‌రో  రెండు చార్జీషీట్‌ల‌ను వేసింది సిబిఐ. లేపాక్షి నాలెడ్జ్ హ‌బ్‌, ఇందూ సంస్థలపై తాజా చార్జీ షీట్లు దాఖ‌లుచేసింది. ఇందూ సంస్ధ నుంచి జ‌గ‌న్ కంపెనీల‌లోకి దాదాపు 70 కోట్లకు పైగా నిధులు మ‌ళ్లించినట్టుగా సిబిఐ ఆరోపించింది.

జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి తండ్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న స‌మ‌యంలో ఇందూ సంస్థకు 8,848 ఎక‌రాల భూమిని కూటాయించారు.దీనితో పాటు శంషాబాద్‌లో మ‌రో 250 ఎక‌రాల భూమిని కూడా కేటాయించిన‌ట్టుగా సిబిఐ తెలిపింది. ఇందుకు ప్రతిగా జ‌గ‌న్ కంపెనీల్లో ఇందూ సంస్థ భారీగా పెట్టుబ‌డులు పెట్టిన‌ట్టుగా ఆరోపించింది.

అయితే ఇటీవ‌ల వేసిన చార్జీషీట్లలొ మంత్రుల‌కు ఊర‌ట ఇచ్చిన సిబిఐ, లేపాక్షి అంశానికి సంబంధించిన ఛార్టీషీటులో మంత్రి గీతా రెడ్డి, మాజీ మంత్రి ధర్మాన ప్రసాద రావులపై, ఇందు ప్రాజెక్టు అంశంలో మాజీ మంత్రి సబితా ఇంద్రా రెడ్డిలపై సిబిఐ అభియోగాలు దాఖలు చేసింది. గీతా రెడ్డిని ఎ9గా, ధర్మానను ఎ11గా, సబితా ఇంద్రా రెడ్డిని ఎ8గా పేర్కొంది.