Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...వైసీపీ పాలనకి తొలి వర్ధంతి శుభాకాంక్షలతో
posted on: Jun 3, 2025 6:08PM

చాలా మంది జగన్ అనేవాడు. చాలా చాలా బాధ పడుతున్నాడు. నీరసించి పోయాడు..అస్సలు డబ్బులు లేవంట కనీసం ఆఫీసు రెంటు కూడా కట్టలేక పోతున్నాడంట..అని తీవ్ర నిరాశా నిస్పృహలతో అలమటించిపోతున్నారుగానీ.. జగన్ పరిస్థితి అలాగేం లేదు. అందుకు మచ్చు తునక మద్యం కుంభకోణం. ఒక్క మద్యం కుంభకోణం విలువ 3వేల ఆరు వందల కోట్లంటే.. మిగిలిన కుంభకోణాల పరిస్తితి ఏంటి? ఒక్కసారి ఆలోచించుకోండి. ఒక రోజుకు జగన్ కలెక్షన్ కొన్ని కోట్లల్లో ఉండేవని.. ఆయన ప్రాంగణానికి వెళ్లివచ్చిన అకౌంటెంట్లు చెప్పేవారప్పట్లో. అదే తర్వాతి రోజుల్లో కంటైనర్ల రూపంలో బయటకెళ్లాయన్న టాకుండేది.. ఈ విషయం ఎవరో ఎన్నారై వచ్చి ఎలుగెత్తి చాటే వరకూ ఇక్కడెవరికీ తెలిసింది కాదు.
ప్రస్తుతం జగన్ కి వచ్చిన ఇబ్బందేం లేదు. ఆయన అప్పులు చేసి మరీ రాష్ట్రాన్ని దివాలా తీయించి మరీ ఒకరు కష్టపడి కట్టిన పన్నులను ఇతరులకు ధారాదత్తం చేసి.. అదంతా తానే ఇచ్చినట్టు బిల్డప్ ఇచ్చేవాడు. దీంతో జగన్ దయగల ధర్మ ప్రభువు. దాత అనే పేరుండేది. ఒక వేళ నిజంగానే అంతటి ధర్మాత్ముడైతే బెజవాడ వరదలపుడు కోటి రూపాయలు ఇస్తానన్నాడు. ఇచ్చాడా? ఏదీ ఆ కోటి రూపాయల విరాళం? అప్పన్న గోడ కూలి చనిపోయిన వారికి మిగిలిన ఎక్స్ గ్రేషియా 75 లక్షలు తాను అధికారంలోకి వచ్చాక ఇస్తానంటాడు. అదే తాను ఇవ్వొచ్చు. కానీ ఇవ్వడు. ఇదంతా జనం సొమ్ము జనానికే పంచి.. ధర్మప్రభువనే పేరు సాధించే ఎత్తుగడలో ఒక భాగం. అంతేనా.. మీరు నన్ను గెలిపిస్తేనే నేను మీకు మిగిలిన పరిహారం ఇస్తాననే బ్లాక్ మెయిల్. చూశారా బిల్డప్పు బ్లాక్ మెయిల్ రాజాగా మన జగనన్నకు ఎంతటి తెలివితేటలున్నాయో!
ఆమాటకొస్తే జగన్ తన సమీక్షా సమావేశాలు కూడా ఓట్ ఆర్ నోట్ దిశగానే నడిపేవాడన్న పేరుంది. అయితే ఓట్లు లేకుంటే నోట్లు గలగలలాడితేనే జగన్ అనేవాడు ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాలు నిర్వహించేవాడంట. మీకు తెలుసా? ఉన్నత విద్యామండలికి సంబంధించి సమీక్ష ఉంది సార్ అని అధికారులు అంటే అందులో ఓట్లు గానీ నోట్లు గానీ వచ్చేదుందా? అలాంటిదేం ఉండదు సార్.. ఇది ఉన్నత విద్య కదా.. పైపెచ్చు మనమే ఎదురు ఖర్చు చేయాల్సి ఉంటుందని అంటే.. అయితే మనకేం అక్కర్లేదని అధికారులతో మొహాన అనేవాడట. అలా ఆయన వివిధ మార్గాల ద్వారా తన సొంతానికి డబ్బు పెద్ద ఎత్తున సంపాదించుకున్నట్టు టాక్.
ఈ అవినీతికి జనసంక్షేమం అనే అడ్డు గోడలను కట్టుకున్నట్టు ఒక అంచనా. అందుకే చూడండి.. జగన్ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ ఏదో ఒక స్కామ్ లో ఉంటారు. ఉండి తీరుతారు. ఆఖర్న ఏపీడీసీ అనేదాన్లో కూడా కోట్లాది రూపాయల మొత్తంలో అవినీతి జరిగిందంటే పరిస్థితేమిటి? అందిన కాడికి అందినట్టు దోచుకుని.. ఇవాళ కొందరు చేసిన పాపానికి ఊచల్లెక్కెడుతుంటే.. మరి కొందరు జైలుకెళ్లే దారి మధ్యలో ఉన్నారంటే కారణం ఇదే. అలాంటి జగన్ ప్రస్తుతం ఎలాంటి సిట్యువేషన్లో ఉన్నాడంటే.. తాను బయటకొస్తే చాలు జనం ఎగబడుతున్నారు అది తన పాపులారిటీ అని చెప్పుకోవడంలో భాగంగా.. అక్కడా డబ్బులిచ్చి మరీ జనాన్ని పోగేసుకుని సీన్ క్రియేట్ చేసుకుంటున్నాడట. ఒకనాటికి తననుగానీ అరెస్టు చేస్తే.. ఇదిగో ఈ జనాన్నే ప్రయోగించి అల్లకల్లోలం చేస్తానంటూ హింట్ ఇస్తున్నాడట జగన్.






