TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జగన్ కు రేవంత్ రెడ్డి ప్రశ్న?

Published on: Sat Dec 17, 2011 8:19AM

హైదరాబాద్: వైయస్ జగన్మోహన్ రెడ్డి తనకు రిలయన్స్ అడాగ్‌తో ఉన్న సంబంధాలేమిటో బహిరంగ పర్చాలని తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి శుక్రవారం ప్రశ్నించారు. వైయస్ రాజశేఖర రెడ్డి మృతి వెనుక ఏ కంపెనీ ఉందని జగన్ ఆరోపించారో అదే కంపెనీ నుండి ఆయన కంపెనీలోకి పెట్టుబడులు ఎలా వచ్చాయన్నారు. నిమేష్ బ్రీఫ్ కేసు కంపెనీ ద్వారా జగన్ కంపెనీలోకి పెట్టుబడులు వచ్చాయని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. సాక్షి పత్రిక నల్లధనం పెట్టుబడులతో పుట్టుకు వచ్చిందన్నారు. టిడిపి అవిశ్వాసం ఎందుకు పెట్టిందో తెలియదంటూ పిసిసి చీఫ్ బొత్స కొంచెం ఎక్కువ అమాయకత్వాన్ని ప్రదర్శిస్తున్నారని రావుల చంద్రశేఖర రెడ్డి, బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి వేరుగా అన్నారు. విప్ ధిక్కరించిన ఎమ్మెల్యేలపై వేటు వేయడానికి ప్రభుత్వం భయపడుతోందన్నారు. తమ పార్టీ అధినేత చంద్రబాబుకు బొత్సలా కుంభకోణాలు చేసే ధైర్యం లేదన్నారు.