రాహుల్ కోసం జగన్ ను జైలుకు పంపారా?
Published on: Thu May 31, 2012 12:13PM
2014 ఎన్నికల్లో విజయం సాధించి దేశాప్రదానిగా రాహుల్ గాంధీని పీఠమెక్కించాలని కాంగ్రెస్ కలలు కంటోంది. ఈ కలలు నెరవేరాలంటే రాష్ట్రంలో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ అడ్డంకి. అందుకే ఆయన్ను జైలుకు పంపించారని ఆ పార్టీ నాయకుడు జనక్ ప్రసాద్ ఆరోపించారు. తమ నాయకుడు ఓదార్పుయాత్ర ద్వారా రాష్ట్రంలో బలమైన స్థానాన్ని సంపాదించినందున కాంగ్రెస్ భయపడి సిబీఐ తో అరెస్టు చేయించిందని ఆయన ఆరోపిస్తున్నారు. ఈ రెండు ఆరోపణలూ రాష్ట్రవ్యాప్తంగా సంచలనమయ్యాయి. నిజంగానే కాంగ్రెస్ ఆ తరహాలో ఆలోచించి ఉంచవచ్చనే అభిప్రాయానికి తీసుకువచ్చేందుకే విజయమ్మ ప్రచారం జరుగుతోందని అర్థమవుతోంది. అయితే కాంగ్రెస్ నాయకులు మాత్రం తమది జాతీయపార్టీ అయినందున ఒక్క రాష్ట్రంలో వచ్చే సీట్లే అధికారానికి ఉపయోగపడతాయా అని ఎదురు ప్రశ్నిస్తున్నారు. తమ బలం ఏమీ తగ్గలేదనీ, తమపై ఆరోపణలు మానేసి జగన్ తన నిజాయితీని నిరూపించుకుని బయటకు రావాలని వారు సూచించారు.


