ప్రభుత్వంపై జగన్ వర్గం నేత పొగడ్తల వర్షం
Published on: Tue Feb 7, 2012 2:42PM
రాజ
మండ్రి: వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం నేత ఒకరు తన స్వరం మార్చారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై నిత్యం విమర్శలు గుప్పించే ఆయన అదే ప్రభుత్వంపై పొగడ్తల వర్షం కురిపించారు. మాజీ మంత్రి, జగన్ వర్గం తూర్పు గోదావరి జిల్లా నేత పిల్లి సుభాష్ చంద్ర బోసు జిల్లాలో మంగళవారం మంత్రి సుదర్శన్ రెడ్డి పాల్గొన్న ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రభుత్వం బాగా పని చేస్తుందని కితాబునిచ్చారు. చెన్నారెడ్డి ప్రభుత్వం తర్వాత ఈ ప్రభుత్వంలోనే ఇరిగేషన్ అభివృద్ధి జరిగిందని ప్రశంసించారు. ఇరిగేషన్ మంత్రిని ప్రత్యేకంగా అభినందిస్తున్నానని అన్నారు. కాగా జగన్ వర్గం నేతల్లో పిల్లి సుభాష్ చంద్ర బోసు ప్రముఖ నేత కావడం గమనార్హం.


