జగన్ వర్గం ఎమ్మెల్యేలపై కొండ్రు సంచలన వ్యాఖ్యలు
Published on: Sun Jan 29, 2012 1:43PM
హైద
రాబాద్: వైయస్ జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులపై ప్రభుత్వ విప్ కొండ్రు మురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమపై వేటు వేయవద్దని వైయస్ జగన్ వర్గానికి చెందిన కొంత మది శాసనసభ్యులు కోరుతున్నారని ఆయన చెప్పారు. కాంగ్రెసులోకి తిరిగి వస్తామని కొంతమంది శాసనసభ్యులు తమను సంప్రదిస్తున్నారని ఆయన చెప్పారు. విప్ ధిక్కరించిన శానససభ్యులపై వేటు పడాలన్నదే తమ వాదన అని ఆయన అన్నారు. ఉప ఎన్నికలను ఎదుర్కోవడానికి భయపడి అనర్హత వేటు వేసే విషయంలో తాము జాప్యం చేయిస్తున్నట్లు వస్తున్న విమర్శల్లో నిజం లేదని ఆయన అన్నారు. కొండ్రు మురళి ఓ ప్రముఖ తెలుగు టీవీ చానెల్ ప్రతినిధితో మాట్లాడారు. శాసనసభ స్పీకర్ ముందు తాము అన్ని విషయాలు పెట్టామని ఆయన చెప్పారు. కొంత మంది శాసనసభ్యులు వేటు నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు. స్పీకర్ సమక్షంలోనే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేశారని, చర్యలు తీసుకోవడానికి అది చాలునని ఆయన అన్నారు. విప్ అందలేదని చెప్పడాన్ని ఆయన వ్యతిరేకించారు.


