జగన్‌కు ఏమైనా జరిగితే రాష్ట్రం అగ్నిగుండం జూపూడి
Published on: Mon Jan 23, 2012 4:12PM
హైద
రాబాద్: వైయస్ జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వం భద్రతను కుదించింది. దీనిపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర రావు సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ప్రభుత్వాన్ని హెచ్చరించారు. వైయస్ జగన్‌కు ఏమైనా జరిగితే రాష్ట్రం అగ్నిగుండం అవుతుందని ఆయన అన్నారు. ప్రజా నాయకుడికి భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని ఆయన అన్నారు. ప్రభుత్వం దళితులకు వ్యతిరేకంగా పనిచేస్తోందని ఆయన విమర్శించారు.


