TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

చిరంజీవితో బాలయ్య రాజకీయ సమరం

Published on: Sat Jan 21, 2012 8:23AM

హైదరాబాద్: వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడానికి కాంగ్రెసు పార్టీ మెగాస్టార్ చిరంజీవిని కలుపుకుంది. చిరంజీవికి, వైయస్ జగన్‌కు మధ్య రాజకీయ సమరం సాగుతుందని భావిస్తున్న తరుణంలో తెలుగుదేశం పార్టీ నుంచి బాలకృష్ణ దూకుడుగా ముందుకు వస్తున్నారు. చిరంజీవి వ్యాఖ్యలపై ఆయన మాట్లాడిన తీరు ఆ విషయాన్ని పట్టిస్తోంది. అంతేకాకుండా జూనియర్ ఎన్టీఆర్ విషయంలో ఆయన చేసిన వ్యాఖ్య కూడా ఆయన రాజకీయ పరిణతిని సూచిస్తోందని అంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్‌పై మీడియా ప్రతినిధులు అడిగినప్పుడు రావడం రాకపోవడం జూనియర్ ఎన్టీఆర్ ఇష్టమనే పద్ధతిలో మాట్లాడారు. గతంలో పార్టీ కోసం చంద్రబాబు నాయుడే జూనియర్ ఎన్టీఆర్‌ను బాలకృష్ణకు సన్నిహితం చేశాడు. ఇక, కాంగ్రెసు పార్టీని ఎదుర్కోవడంలో భాగంగా చిరంజీవిపై రాజకీయ సమరం సాగించడానికి బాలకృష్ణ సమాయత్తమయ్యారనే చెప్పాలి. చిరంజీవి సామాజిక న్యాయ నినాదంపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దానిపై చిరంజీవి బాలయ్య చిన్న పిల్లాడిలా మాట్లాడారని, చిన్న పిల్లల మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. దీనికి బాలకృష్ణ దీటైన సమాధానం ఇచ్చారు. చిరంజీవి బాగానే నేర్చుకున్నారని, ఢిల్లీలో బేరసారాలు సాగిస్తున్నారని వ్యాఖ్యానించారు. చిరంజీవితో బాలయ్య ఈ రాజకీయ సమరం మరింత ముదిరే అవకాశాలు ఉన్నాయి.