ప్రత్యేక సెల్ కేటాయించాలని సాయి రెడ్డి పిటిషన్
Published on: Wed Jan 11, 2012 12:30PM
హైదరా
బాద్: వైయస్ జగన్ ఆస్తుల కేసులో అరెస్టైన జగతి పబ్లికేషన్ వైస్ చైర్మన్ విజయ సాయి రెడ్డి తనకు ప్రత్యేక సెల్ కేటాయించాలని కోరుతూ సిబిఐ ప్రత్యేక న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. ఆయన పిటిషన్ స్వీకరించిన కోర్టు విచారణను ఈ నెల 17వ తేదికి వాయిదా వేసింది. కాగా విజయ సాయిని మొదట ఐదు రోజుల పాటు సిబిఐ కస్టడికీ అప్పగించిన కోర్టు, సిబిఐ పిటిషన్ మేరకు మరో వారం రోజులు పొడిగించిన విషయం తెలిసిందే. ఆయనను పదిహేడవ తేది వరకు సిబిఐ కస్టడీకి అప్పగించింది. దీంతో మరో వారం రోజుల పాటు విజయ సాయి రెడ్డి ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల మధ్య సిబిఐ విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుంది.


