TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జగన్ ను అరెస్టు చేయాలని వీహెచ్ డిమాండ్

Published on: Sat Jan 7, 2012 11:12AM

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీని విమర్శిస్తే కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపై ఎందుకు స్పందించడం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డికి తగిన గుణపాఠం చెప్పకపోతే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని వీహెచ్ అన్నారు. వై.ఎస్. జగన్‌ను అరెస్టు చేయాలని వీహెచ్ డిమాండ్ చేశారు. బయట ఉంటే సాక్ష్యాలను తారుమారు చేస్తారని ఐఎఎస్ అధికారి శ్రీలక్ష్మి బెయిల్‌ను రద్దు చేశారని, వైయస్ జగన్ బయట ఉంటే సాక్ష్యాలను తారుమారు చేయరా అని ప్రశ్నించారు. సాక్ష్యాలు ఉన్నందున వైయస్ జగన్‌ను వెంటనే అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సీబీఐ విచారణను ప్రభావితం చేయడానికే జగన్ దీక్షలు చేపడుతున్నారని వీహెచ్ ధ్వజమెత్తారు. పార్టీ విప్‌‌ను ధిక్కరించిన పార్టీకి చెందిన వైయస్ జగన్ వర్గం శానససభ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.