TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మేము చెబుతూనే ఉన్నాం..అది రుజువైంది బాబు

Published on: Sat Dec 31, 2011 2:48PM

హైదరాబాద్: వైయస్ జగన్, కేసీఆర్ ల మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ రుజువైందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. మ్యాచ్ ఫిక్సింగ్ వల్లనే తెలంగాణలోని ఉప ఎన్నికలకు దూరంగా ఉండాలని జగన్ నిర్ణయించుకున్నారని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. కెసిఆర్, జగన్ కలిసి పని చేస్తున్నారని తాము చెబుతూనే ఉన్నామని, అది ఈ రోజు రుజువైందని ఆయన అన్నారు. తెలంగాణపై తమ నిర్ణయాన్ని ఎప్పుడో చెప్పామని, మళ్లీ చెప్పాల్సిన అవసరం లేదని, తాము అఖిలపక్ష సమావేశానికి వెళ్లబోమని ఆయన చెప్పారు. తెలంగాణపై నిర్ణయం చెప్పాల్సిన బాధ్యత కాంగ్రెసు పార్టీది, కేంద్ర ప్రభుత్వానిది అని ఆయన అన్నారు. రాజకీయ దురుద్దేశంతోనే తెలంగాణపై తమను లక్ష్యం చేసుకున్నారని ఆయన విమర్శించారు. రాష్ట్ర హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి అసాంఘిక శక్తులను ప్రోత్సహిస్తున్నారని ఆయన విమర్శించారు. మహిళల దుస్తులపై డిజిపి దినేష్ రెడ్డి చేసిన ప్రకటన సరైంది కాదని, ఇటువంటి ప్రకటనలు మానేసి డిజిపి శాంతిభద్రతలపై దృష్టి పెట్టాలని ఆయన అన్నారు. 2011లో ప్రజలకు అన్నీ ఇబ్బందులే కలిగాయని, 2012లో మంచి జరుగుతుందని ఆశిస్తున్నామని ఆయన అన్నారు. 2012లో తాము ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామని ఆయన చెప్పారు.