నిర్ణయం స్పీకర్ ఇష్టం కొండా సురేఖ
Published on: Mon Dec 26, 2011 2:17PM
హై
దరాబాద్: వైయస్ జగన్మోహన్ రెడ్డికి టిఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావుతో ఎలాంటి మ్యాచ్ ఫిక్సింగ్ లేదని కొండా సురేఖ సోమవారం అన్నారు. స్పీకర్ నాదెండ్ల మనోహర్‌ను కలిసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. పరకాలలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పోటీ చేయాలా వద్దా అని ఇంకా నిర్ణయించుకోలేదన్నారు. పార్టీకి ఎన్నికల గుర్తింపు రాలేదని చెప్పారు. తాను పరకాలలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయవచ్చునని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలంగాణ సెంటిమెంట్ టిఆర్ఎస్ సొత్తు కాదన్నారు. తెలంగాణ కోసం ఇప్పటికే తాను రాజీనామా చేశానని, ఇప్పుడు అనర్హత పిటిషన్ ఇచ్చారన్నారు. దేనిపై నిర్ణయం తీసుకోవాలో స్పీకర్ ఇష్టమన్నారు. కాగా అంతకుముందు బాలినేని, ప్రసాద రాజు మాట్లాడారు. తమపై వేటు వేయాలని స్పీకర్‌ను కోరినట్లు చెప్పారు. తమపై అనర్హత వేటు పడుతుందనే తాము భావిస్తున్నామన్నారు.


