జగన్ తో తెగతెంపులు..జయసుధకు బంపర్ ఆఫర్?
Published on: Mon Dec 26, 2011 12:23PM
హైదరా
బాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్.జగన్మోహన్ రెడ్డితో పూర్తిగా తెగతెంపులు చేసుకున్నందుకు గాను సికింద్రాబాద్ ఎమ్మెల్యే, సహజనటి జయసుధకు బంపర్ ఆఫర్ లభించనుంది. రాష్ట్ర మహిళా ఛైర్మన్‌గా జయసుధను నియమించేదుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దాదాపుగా ఓ నిర్ణయానికి వచ్చినట్టు అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచరం. ఇదే అంశంపై సీఎం కార్యాలయం త్వరలోనే అధికారిక ఉత్తర్వులు వెలువరించే అవకాశంఉన్నట్టు తెలుస్తోంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి స్ఫూర్తితో సినీపరిశ్రమ నుంచి రాజకీయాల్లో అరంగేట్రం చేసిన జయసుధ, ఆయన ప్రోత్సాహంతోనే 2009 అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. వైఎస్సార్ పేరును సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొనడాన్ని నిరసిస్తూ ఎమ్మెల్యే పదవులకు రాజీనామాలు సమర్పించిన ఎమ్మెల్యేల బృందంలో ఆమె కూడా ఉన్నారు. అయితే ఆ తర్వాత కాంగ్రెస్ ప్రయోగించిన పునరాకర్షక్ మంత్రంతో జయసుధ జగన్‌కు గుడ్‌బై చెప్పి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. దీనికి ప్రతిఫలంగా జయసుధకు తగిన న్యాయం చేకూర్చాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి భావించారు. ఇందులోభాగంగానే ఇచ్చిన హామీ మేరకు జయసుధకు మహిళా కమిషన్ ఛైర్మన్ పదవి ఇవ్వాలని కిరణ్ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.


