దస్తగిరి బెయిల్ రద్దు చేయండి.. తెలంగాణ హై కోర్టులో భాస్కర్ రెడ్డి పిటిషన్
Published on: Tue Apr 4, 2023 2:54PM
వైఎస్ వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ భాస్కర్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో ఏ4గా ఉన్న దస్తగిరిని అప్రూవర్ గా ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ ఆయన పిటిషన్ వేశారు.
దస్తగిరి వాంగ్మూలం ఆధారంగా తమపై నేరాన్ని మోపడం సరికాదని ఆ పిటిషన్ లోపిటిషన్ లో పేర్కొన్నారు. సీబీఐ అధికారులు చెప్పిన విధంగానే దస్తగిరి వాంగ్మూలం ఇస్తున్నాడని, వాస్తవానికి వివేకా హత్య కేసులో దస్తగిరిదే కీలక పాత్ర అని ఆయన పేర్కొన్నారు.
వివేకా హత్య కేసులో కీలకమైన ఆయుధాన్ని కొనుగోలు చేసింది కూడా దస్తగిరేనని, అలాంటి దస్తగిరికి బెయిల్ విషయంలో సీబీఐ సహకరించిందని పేర్కొన్నారు. దస్తగిరి బెయిల్ ను రద్దు చేయాలని ఆ పిటిషన్ లో కోరారు.


