Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...లైంగిక వేధింపుల కేసులో యూట్యూబర్ శంకర్ అరెస్ట్
posted on: Mar 29, 2025 5:12PM
లైంగిక వేధింపుల కేసులో యూట్యూబర్ శంకర్ ను హైద్రాబాద్ అంబర్ పేట పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ మహిళ తనను లైంగికంగా వేధించాడని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యా దు చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా శంకర్ ను అరెస్ట్ చేశారు. తన భర్తతో విడాకులు తీసుకున్న తర్వాత శంకర్ తనకు మాయమాటలు చెప్పి లోబరుచుకున్నట్లు ఆ మహిళ ఫిర్యాదులో పేర్కొన్నారు. తాను పార్ట్ టైం లెక్చరర్ గా పని చేస్తున్న సమయంలో పెళ్లి చేసుకుంటానని మోసం చేసినట్టు చెప్పారు. పెళ్లి ప్రస్తావన తెస్తే సోషల్ మీడియాలో బయటపెట్టాడని ఆ మహిళ ఫిర్యాదు పేర్కొన్నారు. తన తెలంగాణ పిల్ల అనే ట్విట్టర్ అకౌంట్ ను హ్యాక్ చేసినట్టు ఆమె ఆరోపించారు. తనకు ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ ప్రేమిస్తున్నానని నమ్మించి మోసం చేసినట్టు ఆ మహిళ ఫిర్యాదులో పేర్కొన్నారు. శనివారం అంబర్ పేట పోలీసులు అరెస్ట్ చేస్తున్న సమయంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. న్యూస్ లైన్ అనే ఈ యూట్యూబ్ చానల్ గత కొంతకాలంగా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రసారాలు చేస్తోంది.


.webp)



