‘టిక్‌-టాక్‌’ వీడియో చేసి మెడ విరగ్గొట్టుకున్న యువకుడు!

 

ఇటీవల కాలంలో టిక్ టాక్ యాప్ ద్వారా చాలా మంది యువతీ యువకులు క్రేజ్ సంపాదించుకుంటున్నారు. అయితే క్రేజ్ మోజులో పడి కొందరు ప్రాణాల మీదకు కూడా తెచ్చుకుంటున్నారు. తాజాగా.. ఓ యువకుడు టిక్ టాక్ యాప్ పుణ్యమా అని మెడ విరిగి ఆస్పత్రి పాలయ్యాడు.

కర్ణాటక రాష్ట్రం తుమకూరు జిల్లా గూడకెరె గ్రామానికి చెందిన కుమార్‌ అనే వ్యక్తి పల్టీ కొట్టే సాహసం చేశాడు. ఓ మిత్రుడు ఎదురుగా సపోర్ట్‌గా ఉండగా మరొకరు వీడియో తీస్తున్నారు. కుమార్‌ బ్యాక్‌ జంప్‌ చేసేందుకు ప్రయత్నించి ఫీట్‌ను పూర్తి చేయలేకపోయాడు. మెడ నేల మీద బలంగా తాకి ఒక్కసారిగా కుప్పకూలాడు. మెడ భాగం విరిగిపోగా స్పైనల్‌కార్డ్‌ ఎముకలు విరిగినట్టు వైద్యులు నిర్ధారించారు.

సరదాగా చేసిన ఫీట్ తో ఇలా ఆస్పత్రి పాలు కావడంతో అతని కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు. అందుకే యువత సరదా పేరుతో ఇలా పిచ్చి పనులు చేసి తల్లిదండ్రుల కన్నీరుకి కారణం కాకూడదు.