TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జూ.ఎన్టీఆర్ ను థ్రిల్ చేసిన సుకుమార్

Published on: Mon Aug 5, 2013 1:00PM

 

 sukumar ntr new movie,  ntr sukumar,  sukumar young tiger

 

 

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన రూట్ మార్చాడు. ఎప్పుడు భారీ స‌క్సెస్ లు ఇచ్చిన డైరెక్టర్స్‌తో సినిమాలు చేసే యంగ్ టైగర్..ఎప్పుడు క్రియేటివ్ డైరెక్టర్స్ కి కూడా ఛాన్స్ ఇస్తున్నాడు. ఎన్టీఆర్ నెక్ట్స్ సినిమా సుకుమార్ ఢైరెక్షన్లో చేయ‌బోతున్నాడు. ఇప్పటికే సుకుమార్ లైన్ విన్న ఎన్టీఆర్ సూప‌ర్‌గా ఇంప్రెస్ అయ్యాడ‌ట‌. దీంతో ప్రస్తుతం త‌ను చేస్తున్న రామ‌య్య వ‌స్తావ‌య్యా, ర‌భ‌స చిత్రాలు పూర్తవ‌గానే సుకుమార్ డైరెక్షన్లో సినిమాను సెట్స్ మీద‌కు తీసుకెళ్లే ఆలోచ‌న‌లో ఉన్నాడ‌ట‌. బివియ‌స్ ఎన్ ప్రసాద్ నిర్మించనున్న ఈసినిమాకు సంభందించిన మ‌రిన్ని విష‌యాలు త్వర‌లో వెల్లడించ‌నున్నారు.


సుకుమార్ ప్రస్థుతం మ‌హేష్‌బాబు హీరోగా వ‌న్ నేనొక్కడినే అనే సినిమా తెర‌కెక్కిస్తున్నాడు. చాలా రోజులుగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ సినిమా మ‌హేష్ స్లో పాల‌సీకి, సుకుమార్ ప‌ర్ఫెక్షన్ తోడై మ‌రింత ఆల‌స్యం అవుతుంది. అయితే మేకింగ్ సంగ‌తి ఎలా ఉన్న ఇప్పటికే రిలీజ్ అయిన టీజ‌ర్ సెన్సేష‌న్ క్రియేట్ చేయ‌డంతో సినిమా మీద కూడా అంచ‌నాలు భారీగా ఉన్నాయి.