కారు ప్రమాదం.. హీరోకి గాయాలు, మహిళ మృతి

 

గుంటూరు జిల్లా మంగళగిరి మండలం చినకాకాని జాతీయ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందగా, యువ హీరో సుధాకర్‌ గాయపడ్డాడు. శేఖర్‌కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌’ చిత్రంలో నాగరాజు పాత్రతో వెండితెరకు పరిచయమైన సుధాకర్‌.. తాజాగా ‘నువ్వు తోపురా’ చిత్రంలో హీరోగా నటించారు. ఈ సినిమా ప్రచారంలో భాగంగా హైదరాబాద్‌ నుంచి గుంటూరు వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. జాతీయ రహదారిపై మొక్కలకు నీళ్లు పెడుతున్న మహిళను సుధాకర్‌ కారు ఢీకొంది. ఈ ఘటనలో ఆ మహిళ అక్కడికక్కేడే మృతి చెందగా, కారులో ఉన్న నటుడు సుధాకర్‌ గాయపడ్డారు.