యువతి ప్రాణాలు తీసిన సెల్‌ఫోన్
Published on: Sat Sep 20, 2014 9:39AM

ఈమధ్యకాలంలో యువతరానికి సెల్‌ఫోన్‌లో పాటలు వింటూనో, సెల్‌ఫోన్ మాట్లాడుతూనే రోడ్డు మీద నడవటం, రోడ్డు దాటటం మామూలైపోయింది. ఇలాంటి అలవాటే వున్న ఓ యువతి చివరకు ప్రాణాలు కోల్పోయింది. ఘజియాబాద్‌కి చెందిన యువతి సెల్‌ఫోన్లో పాటలు వింటూ రైల్వే ట్రాక్స్ దాటుతోంది. పాటల తన్మయత్వంలో వున్న ఆమె దూసుకొస్తున్న రైలుని గమనించలేదు. అది చూసిన స్థానికులు ఆమెను హెచ్చరించే ఉద్దేశంతో గట్టిగా వేసిన కేకలు కూడా ఆమెకు వినిపించలేదు. క్షణాల్లో దూసుకొచ్చిన రైలు కింద పడి ఆమె మరణించింది.


