ఫేజ్..ఫేజ్‌కు పడిపోతున్న యోగీ గ్రాఫ్.. యూపీ ఓటర్స్ పల్స్!
Published on: Sat Feb 19, 2022 4:27PM
5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సంగ్రామంలో అత్యంత కీలకమని భావిస్తున్న, ఉత్తర ప్రదేశ్’లో ఇప్పటికే వందకుపైగా నియోజక వర్గాల్లో ఓటర్లు తమ తీర్పును ఈవీఎంలలో భద్ర పరిచారు. ఈ ఎన్నికలలో ప్రజల తీర్పు ఎలా ఉంటుంది? ఏఏ అంశాలు ఓటర్లను ప్రభావితం చేస్తాయి, అంటే, ఇంతవరకు వచ్చిన సర్వేలు, విశ్లేషణలు అన్నీ కూడా చాల వరకు కుల సమీకరణల మీద ఆధారపడే చేసినట్లు కనిపిస్తోంది. నిజమే, యూపీ ఎన్నికలలో, ఆ మాట కొస్తే ఏ రాష్ట్రంలో అయినా, కులం. మతం ఎన్నికల ఫలితాల పై ప్రభావం ప్రభావం, చూపుతాయి, అది నిర్వివాదాంశం. అయితే, అదొక్కటే ఎన్నికల ఫలితాలను తారు మారు చేస్తుందనేది మాత్రం నిజం కాదని, తొలి రెండు విడతల పోలింగ్ సరళిని బట్టి తెలుస్తోందని స్థానిక పత్రికల కథనాలు సూచిస్తున్నాయి.
స్థానిక పత్రిల కథనాల ప్రకారం ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో ఎన్నికలతో సంబంధం లేకుండానూ కులం ఒక ముఖ్యమైన అంశం. అందులో రెండవ అభిప్రాయం లేదు. కానీ, ఈ ఎన్నికలలో కులంతో పాటుగా ప్రజా సమస్యలు కూడా ఓటర్లను ప్రభావితం చేస్తున్నాయి. ఓటర్లను ప్రబావితం చేస్తున్న అంశాల్లో కులం కంటే ఎక్కువగా 34శాతం మంది అభివృద్ధికి ఓటు వేశారు. అంటే, మొత్తం ఓటర్లలో 10 శాతం మంది కులానికి ప్రధాన్యత ఇస్తున్నారు అనుకుంటే, 44 శాతం అభివృద్ధి వైపు మొగ్గుచూపారు. అలాగే 13 శాతం మంది కులం కంటే ద్రవ్యోల్బణానికి ప్రాధాన్యత ఇచ్చారు. అలాగే , అవినీతి, నిరుద్యోగం వాణివంటి సమస్యలు చివరకు పశువుల దొంగతనాల వంటి సమస్యలు కూడా ఓటర్లను ప్రభావితం చేస్తున్నాయని స్థానిక రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఒక విధంగా చూస్తే కులాల ప్రభావం కంటే, ప్రజా సమస్యల ప్రభావమే అధికంగా కనిపిస్తోందని పరిశీలకులు అంటున్నారు.
సెంటిమెంట్ పరంగా చూస్తే, ప్రస్తుతం అధికారంలో ఉన్నబీజేపీ పట్ల, ప్రజల్లో సానుకూలత వుంది. కానీ, ప్రభుత్వ ఉద్యోగుల మొదలు ప్రతి వర్గంలోనూ ఏదో ఒక విషయంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పాత పెన్షన్ విధానం (సీపీఎస్) కొనసాగించాలని ఉద్యోగులు కోరుతున్నారు. అయితే అది కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశం కావడంతో, బీజేపీ హామీ ఇవ్వలేదు. అయితే, ఎస్పీ మాత్రం, ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చింది. అలాగే, ప్రభుత్వ ఉద్యోగాల విషయంలోనూ గడచిన ఐదేళ్లలో బీజేపీ ప్రభుత్వం విఫలమైంది. దీంతో, నిరుద్యోగ యువత బేజేపీకి వ్యతిరేకంగా ఉన్నారు. ఇది గమనించిన ఎస్పీ, తమ పార్టీ అధికారంలోకి వస్తే 22 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చింది. ఇక రైతుల విషయం అయితే చెప్పనే అక్కర లేదు.
అదే విధంగా ఇతర అన్ని వర్గాల ప్రజలలో ఉన్న వ్యతిరేకత కలిసి, కుల సమీకరణాలను తారుమారు చేస్తాయన్న ప్రాధమిక అంచనాలతో చేసిన సర్వేలు, చేస్తున్న విశ్లేషణలకు భిన్నంగా ఫలితాలు ఉంటాయని రెండు విడతల ఓటింగ్ సరళి ఆధారంగా స్థానిక విశ్లేషకులు, అంటున్నారు. బీజేపీకి ఆశించిన ఫలితాలు రాకపోవచ్చని, యోగీ ఆదిత్య నాథ్’ కూడా గత ముఖ్యమంత్రులలానే, బ్రేక్ తెసుకోక తప్పదని అంటున్నారు.


