ఓటమిని అంగీకరిస్తున్నాం... తక్కువ అంచనా వేశాం
Published on: Wed Mar 14, 2018 6:09PM
.jpg)
యూపీలో జరిగిన ఉపఎన్నికల్లో కూడా బీజేపీ ఓటమిపాలైంది. యూపీలోని గోరఖ్ పూర్, ఫుల్ పూర్ నియోజకవర్గాల్లో ఉపఎన్నికలు జరుగగా ఫలితాలు వెలువడ్డాయి. ఈ రెండు స్థానాల్లోనూ బీజేపీ ఓడిపోయింది. ఇక ఈ ఎన్నికలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించి... ఎస్పీ-బీఎస్పీ పొత్తును తక్కువ అంచనా వేశామని, ఓటమిని అంగీకరిస్తున్నామని అన్నారు. ఈ ఉపఎన్నికల ఫలితాలు తమకు ఓ గుణపాఠమని, ఓటమిపై ఆత్మపరిశీలన చేసుకుంటామని, పార్టీ ఓడిపోవడానికి గల కారణాలు, జరిగిన పొరపాట్లపై విశ్లేషిస్తామని చెప్పారు. ఎస్పీ-బీఎస్పీ పొత్తును ప్రభావం ఎన్నికల ఫలితాలపై ఉండదని భావించామని, స్థానిక అంశాలు కూడా తమ పార్టీ ఓటమికి కారణాలు కావచ్చని అన్నారు.


