యోగి మరో నిర్ణయం...అఖిలేశ్ స్కూల్ బ్యాగులను పంచండి...
Published on: Mon May 1, 2017 6:11PM
.jpg)
ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. గతంలో ప్రభుత్వ పథకాలకు పార్టీ పేర్లను తీసేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు సీఎం అఖిలేశ్ యాదవ్ ఫొటోలతో ముద్రించిన వేలాది స్కూల్ బ్యాగులను విద్యార్థులకు పంచేందుకు ఆయన అనుమతి ఇచ్చారు. పాఠశాలల ప్రారంభానికి ముందే వీటిని చిన్నారులకు అందజేయాలని ఆదేశించారు. కాగా ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు గత మార్చిలో అఖిలేశ్ యాదవ్ సీఎంగా ఉండగా ఆయన ఫొటోలతో 35వేల స్కూల్ బ్యాగులను ముద్రించారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే.


