TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

యోగి సంచలన వ్యాఖ్యలు... 'ఈవీఎం' అంటే 'ఎవ్రీ ఓట్ మోడీ'..

Published on: Sat Apr 29, 2017 6:07PM

 

ఉత్తరప్రదేశ్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుండి యోగి ఆధిత్యనాథ్ పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు యోగి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం చాటుకోవడంతో.. ప్రతిపక్ష పార్టీలు ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగాయని... ఏ బటన్ నొక్కినా బీజేపీకే ఓటు వెళ్లిందని ఆరోపిస్తున్నారు. అంతేకాదు తాజాగా జరిగిన ఢిల్లీ ఎన్నికల్లోనూ ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. ఇదిలా ఉంటే ఓ సమావేశంలో పాల్గొన్న యోగి ఆప్ వ్యాఖ్యలపై మాట్లాడుతూ.. 'ఈవీఎం అంటే ఎవ్రీ ఓట్ ఫర్ మోదీ' అని వ్యాఖ్యానించారు. ఢిల్లీ ప్రజలు తమ పార్టీ బీజేపీపై నమ్మకం ఉంచారని, అందుకే 'ఈవీఎం.. ఎవ్రీ ఓట్ మోదీ' విధానాన్ని అనుసరించారని పేర్కొన్నారు. మరి యోగి చేసిన వ్యాఖ్యలను ప్రతిపక్షాలు ఏ దృష్టితో చూస్తాయో చూడాలి.