యోగి బాటలో మరో ముఖ్యమంత్రి..
Published on: Sat Apr 1, 2017 10:48AM
.jpg)
ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీసుకుంటున్న నిర్ణయాలు పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాయనే అనిపిస్తుంది. ఎందుకంటే యోగి ఆదిత్యనాథ్ బాటలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా నడుస్తున్నారు. యోగి సీఎంగా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుండి పలు నిర్ణయాలు తీసుకుంటు తన మార్క్ చూపిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే యాంటీ రోమియో స్క్వాడ్ ను ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఆయన ప్రవేశపెట్టిన తరహాలోనే మధ్యప్రదేశ్‌లో అమ్మాయిలపై వేధింపులకు పాల్పడే ఆకతాయిలకు బుద్ధి చెప్పేందుకు ఉద్యమం చేపట్టాలని నిర్ణయించారు. అమ్మాయిలను ఎలా గౌరవించాలో ఆకతాయి కుర్రాళ్లకు తెలియడం లేదని, వారు సమాజానికి శ్రేయస్కరం కాదని పేర్కొన్న చౌహాన్ ఇటువంటి వారికి వ్యతిరేకంగా ఓ ఉద్యమాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. అమ్మాయిలను వేధించే నేరగాళ్లపై పోలీసులు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.


