TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

ములాయం చిన్నకొడుకు ఇంటికి యోగి...

Published on: Fri Mar 31, 2017 11:16AM


ఉత్తరప్రదేశ్ సీఎం ఆదిత్యనాథ్ యోగి ఇంటికి ములాయంసింగ్ యాదవ్ చిన్నకొడుకు వెళ్లి అందరినీ ఆశ్చర్యపరిచిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు యోగి కూడా  ప్రతీక్‌ యాదవ్ ఇంటికి వెళ్లనున్నారు. ప్రతీక్ యాదవ్ నిర్వహిస్తున్న కన్హా ఉపవాన్‌(గోశాల)ను సందర్శించనున్నారు. ప్రతీక్  కన్హా ఉపవాన్ పేరుతో అనేక గోవులను పెంచుతున్నారు. ఈ నేపథ్యంలో గోవులంటే అమితమైన ప్రేమ ఉన్నయోగి గోశాలను సందర్శించనున్నారు. ఇంకా ప్రతీక్‌, ఆయన భార్య అపర్ణా యాదవ్‌తోపాటు ములాయం సింగ్‌, ఆయన భార్య సాధనా యాదవ్‌ కూడా యోగిని క‌ల‌వ‌నున్నారు.