TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

యోగి తాజా రూల్.. 18 నుంచి 20 గంటలు పనిచేయాల్సిందే...

Published on: Mon Mar 27, 2017 12:12PM

 

ఉత్తరప్రదేశ్ సీఎంగా యోగి ఆదిత్యనాథ్ బాధ్యతలు చేపట్టిన దగ్గర నుండి తనదైన శైలిలో నిర్ణయాలు తీసుకుంటూ తన మార్కును చూపిస్తున్నారు. ఇప్పటికే పలు నిర్ణయాలు తీసుకున్న యోగి ఇప్పుడు తాజాగా మరో నిర్ణయం తీసుకున్నారు. అదేంటంటే.. త‌మ‌ రాష్ట్రంలోని ప్రభుత్వాధికారులు, ప్ర‌జాప్ర‌తినిధులు రోజుకు 18 నుంచి 20 గంటలు పనిచేసేందుకు సిద్ధంగా ఉండాలని.. లేదంటే త‌మ‌ ఉద్యోగం వదులుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తాను ప‌ని మాంత్రికుడిన‌ని త‌న‌కు ప‌ని త‌ప్ప వేరే ధ్యాసే లేద‌ని..త‌న రాష్ట్రంలోని అధికారులంతా కూడా అలాగే ఉండాల‌ని... లేదంటే వారు ఉద్యోగాలు వ‌ద‌లేసేయాల‌ని, త‌న‌కు ఎటువంటి అభ్యంత‌రం లేద‌ని వ్యాఖ్యానించారు. అలాగే ప్రభుత్వ పథకాలను అమలు చేయడంలో తాను ఎలాంటి పొరబాట్లను సహించబోనని హెచ్చ‌రించారు.