TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

యోగి ఆధిత్యనాథ్ కు వార్నింగ్... ద‌మ్ముంటే అడ్డుకో..

Published on: Wed Mar 22, 2017 4:20PM

 


యూపీ సీఎం గా బాధ్యతలు స్వీకరించిన యోగి ఆధిత్యనాథ్ తమ పార్టీ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అప్పుడే ఆయనకు బెదిరింపు లేఖలు వచ్చాయి. ఐఎస్ఐఎస్ పేరిట‌ వార్నింగ్ ఇస్తూ ఓ లేఖ రావ‌డం ఇప్పుడు క‌ల‌క‌లం రేపుతోంది. ఆయ‌న‌కు ద‌మ్ముంటే ఎల్లుండి పూర్వాంచ‌ల్‌లో జ‌రిగే హింస‌ను అడ్డుకోవాల‌ని ఆ లేఖ‌లో ఉంది. ఆ లేఖ‌ను ఈ రోజు అక్క‌డి పోలీసులు వార‌ణాసిలోని మిర్జామురాద్ ప్రాంతంలో స్వాధీనం చేసుకున్నారు. పాకిస్థాన్ జిందాబాద్ అని కూడా రాసి ఉన్న ఆ లేఖ‌లో పూర్వాంచ‌ల్ ప్రాంతంలో హింస సృష్టిస్తామ‌ని హెచ్చ‌రికలు చేశారు. వార‌ణాసి ప్ర‌ధానమంత్రి మోదీ నియోజ‌క‌వ‌ర్గం కూడా కావ‌డంతో ఆ లేఖ‌పై పోలీసులు సీరియస్‌గా ఆరా తీస్తున్నారు. మరి లేఖలో పేర్కొన్నట్టు యోగి ఆదిత్యనాథ్ హింసను ఎలా అడ్డుకుంటారో చూద్దాం.