Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ప్రపంచానికి శాంతి నిచ్చే యోగా.. మోడీ
posted on: Jun 21, 2022 12:22PM
యోగా దినోత్సవం సందర్భంగా ప్రపంచ దేశాలలో ఉత్సాహంగా సామూహిక యోగా కార్యక్రమాలు వేడుకగా జరిగాయి. ఐక్యరాజ్యసమితి జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంగా గుర్తించిన సంగతి విదితమే. యోగా డే సందర్భంగా సికిందరాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య పాల్గొన్నారు. మైసూర్ ప్యాలెస్ గ్రౌండ్ లో జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలోనూ యోగా డే ఘనంగా జరిగింది.
యోగా ఎంతో ప్రాచీనమైనదైనా దోషం పట్టనిదని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఆయన సోమవారం యోగా దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పేరేడ్ గ్రౌడ్స్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్య క్రమంలో పాల్గొని ప్రసంగించారు. యోగా కుల మతాలకు అతీతమని, ఇంద్రియాలను, ఆత్మశక్తిని ఏకం చేయడమే యోగా అని తెలియజేశారు. యోగాను ప్రపంచవ్యాప్తంగా పాపులర్ చేసిన ప్రధాని మోడీకి ఈ సందర్భంగా వెంకయ్య ధన్యవాదాలు తెలియజేశారు.
ఆరోగ్యమే మహాభాగ్యమని పెద్దలు చెప్పారని, ప్రాశ్చాత్య వ్యామోహంతో వచ్చిన మార్పులతో యోగా విశిష్టత మరింత పెరిగిందన్నారు. యోగా చేసి దేశాన్ని ఆరోగ్య వంతం చేద్దామని, యోగా సాధనతో ప్రపంచ శాంతి చేకూర్చుకుందామని పిలుపు నిచ్చారు. యోగా స్ట్రెస్, టెన్షన్‌ను పోగొడుతుందన్నారు. ఇంతపెద్ద మొత్తంలో ఇక్కడికి వచ్చి యోగా మహోత్సవ్‌ను విజయవంతం చేసినందుకు ప్రజలకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు , కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తదితరు లు పాల్గొన్నారు.
ఇక ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా మైసూరు ప్యాలెస్ గ్రౌండ్స్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగా మన విశ్వానికి శాంతిని తెస్తుం దని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా యోగా సాధన జరుగుతోందని ఈ సందర్భంగా ప్రధాని తెలియజేశారు. విశ్వమానవాళి ఆరో గ్యమే లక్ష్యంగా ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా యోగా చేస్తున్నారని ప్రధాని మోదీ అన్నా రు. యోగాతో క్రమ శిక్షణ, ఏకాగ్రత లభిస్తాయని ప్రధాని మోదీ వివరించారు. యోగాను అదనపు పనిగా భావించరాదని, రోజూవారీ పనుల్లో ఎంత వొత్తిడికి గురయినప్పటికీ ధ్యానం వల్ల గొప్ప ప్రశాంతత లభిస్తుం దని, యోగాను జీవితంలో ఒక భాగంగా మార్చుకోవాలని ప్రధాని సందేశమిచ్చారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఆయూష్ మంత్రి శర్వానంద సోనోవాల్, కర్ణాటక గవర్నర్ ఘెహ్లాట్, కర్ణాటక ముఖ్యమంత్రి ఎస్. బొమ్మయ్ పాల్గొన్నారు.
ఇదిలా వుండగా, ప్రపంచ వ్యాప్తంగా యోగా డే ఉత్సవాలు జరిగాయి.దేశవ్యాప్తంగా 75 నగరాల్లో యోగా డే వేడుకలు జరిగాయి. ఈ ఏడాది ‘యోగా ఫర్ హ్యుమానిటీ’ నినాదంతో యోగా డే ఉత్సవాలు జరిపారు.


.webp)
.webp)


